తెలంగాణలో కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజుతో నైట్ కర్ఫ్యూ ముగియనుంది. తెలంగాణలో మళ్లీ నైట్ కర్ఫ్యూ ఉంటుందా? లేదా? అనే వార్తలు వచ్చాయి. తాజాగా ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టకపోవడం, దేశవ్యాప్తంగా పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో కర్ఫ్యూని పొడిగించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ విషయమై శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మే 1 నుంచి మే 8 వరకు కర్ఫ్యూని పొడిగిస్తూ జీవో జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు నైట్ కర్ఫ్యూను పక్కగా అమలు చేయాలని సూచించారు.
Must Read ;- అవసరం లేని వారు స్వచ్ఛందంగా ఆసుపత్రి బెడ్లు వీడండి.. సీపీ వినూత్న ట్వీట్












