కొణిదెల వారి యువరాణి నీహారిక .. వెబ్ సిరీస్ తో తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ చేసింది. కొన్ని సిరీస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ క్రెడిట్ తోనే నీహారిక వెండితెరమీద కూడా నటిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంది. ఆమె హీరోయిన్ గా ‘ఒక్క మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యాకాంతం’ లాంటి సినిమాలు రూపాందాయి. అయితే వాటిలో ఒక్కటి కూడా నీహారికకి హీరోయిన్ గా బ్రేక్ తెచ్చిపెట్టలేకపోయాయి.
ప్రస్తుతం నీహారిక తన భర్తతో వైవాహిక జీaతాన్ని ఆనంద మయంగా గడుపుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్ కట్టిపెట్టి.. భర్తే లోకంగా ఉంటోంది. అయితే తాజా సమాచారం ప్రకారం నీహారిక.. త్వరలోనే మళ్ళీ వెండితెరమీద కు రాబోతోందని తెలుస్తోంది. రీసెంట్ గా ఒక కొత్త దర్శకుడు నీహారికకి మంచి స్ర్కిప్ట్ వినిపించాడట. ఆ కథ ఆమెకు ఎంతగానో నచ్చిందట. ఆ సినిమాతో ఆమె టాలీవుడ్ లో కమ్ బ్యాక్ అవుతుందట.
అయితే ఈ సినిమాలో నీహారిక మీద ఎలాంటి రొమాంటిక్ సీన్స్ గాని, సాంగ్స్ గానీ ఉండవట. ఈ సినిమా మహిళా ప్రాధాన్యం కలిగిన ఓ థ్రిల్లర్ మూవీ అట. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ మెంట్ వస్తుందట. అంతే కాదండోయ్.. నీహారిక భర్త చైతన్య కూడా ఇదే సినిమాలో ఓ లీడ్ కేరక్టర్ చేయడం ద్వారా టాలీవుడ్ లోకి ప్రవేశిస్తాడట. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియదు కానీ.. నీహారిక కమ్ బ్యాక్ అవుతుండడం మెగాభిమానుల్ని ఖుషీ చేస్తోంది. మరి దానికి ఎప్పుడు ముహూర్తం నిర్ణయిస్తారో చూడాలి.
ALSO READ :హాయి హాయిగా హనీమూన్ లో నీహారిక కొణిదెల











