ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ సినిమాను రిలీజ్ కు రెడీ చేశారు అక్కినేని నాగార్జున. ఏప్రిల్ 2న సినిమా విడుదల కానుండడంతో .. ప్రచారాల్ని స్పీడప్ చేశారు. దీని తర్వాత నాగ్.. ‘బంగార్రాజు’ ప్రాజెక్ట్ కు షిఫ్టవుతారు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి సీక్వెల్ గా రూపొందనున్న ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. ఇదిలా ఉంటే.. నాగార్జున .. వెబ్ సిరీస్ రంగంలోకి కూడా వెళ్ళే ఆలోచనతో ఉన్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో నాగ్.. ఈ విషయాన్ని రివీల్ చేశారు.
ప్రస్తుతం 3 వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయని అంటున్నారు నాగార్జున. కొన్ని కథల్ని మనం రెండు గంటల్లో చెప్పలేం. వాటికి బాగా స్పేస్ కావాలి. అందుకే అలాంటి కథల్ని వెబ్ సిరీస్ లోనే పెర్ఫెక్ట్ గా చెప్పగలం. ప్రస్తుతం వినోదరంగంలో వెబ్ సిరీస్ చాలా ప్రధాన మైన పాత్ర పోషిస్తున్నాయి అని నాగ్ అభిప్రాయ పడ్డారు. తాజా సమాచారం ప్రకారం నాగ్.. నెట్ ఫ్లిక్స్ వారితో ఒక వెబ్ సిరీస్ కు డీల్ కుదర్చుకున్నారని సమాచారం. ఇటీవల నాగ్.. బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. మరి నాగ్.. వెబ్ సిరీస్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
Must Read ;- ‘బంగార్రాజు’ కు విలన్ గా భూమిక ?











