జయాపజయాలకు ఒకేలా స్పందించే టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ. హిట్టొస్తే.. పొంగిపోవడం.. ప్లాపొస్తే కుంగిపోవడం లాంటివి ఆయనకి తెలియదు. హిట్ అండ్ ఫ్లాప్ ఏదైనా.. ఒక సినిమా తర్వాత మరో సినిమాను పట్టాల మీద పెట్టడం మాత్రమే తెలిసిన రవితేజ.. ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీ అయ్యే పనిలో చాలా నిమగ్నమై ఉన్నాడు.
ఈ ఏడాది సంక్రాంతికి క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ.. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే మాస్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో రవితేజ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడంటూ… వార్తలొస్తున్నాయి. దీని తర్వాత నక్కిన త్రినాథరావు దర్వకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాటితో పాటు ఇప్పుడు రవితేజ మరో సినిమాకి కూడా కమిట్ అయ్యాడని సమాచారం.
మాస్ మహారాజా రవితేజ.. సీనియర్ దర్శకులతో ఎలా పనిచేస్తాడో .. కొత్త దర్శకుల్ని కూడా అలాగే ప్రోత్సహిస్తాడు. ఈ క్రమంలో ఓ యువ దర్శకుడు చెప్పిన కథాంశం రవితేజ కు బాగా నచ్చిందట. అతడు కథను నెరేట్ చేసే విధానం బాగా ఉండడంతో . అతడి మీద నమ్మకంతో దర్శకత్వ బాధ్యతలు కూడా అప్పగించాడని వినికిడి. విరాట పర్వం నిర్మాత.. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే రవితేజ సినిమా గురించి అనౌన్స్ మెంట్ వస్తుందట. మరి ఈ పినిమా మాస్ మహారాజాకు ఏ రేంజ్ లో హిట్టిస్తుందో చూడాలి.
Must Read ;- మాస్ మహారాజ్ సరసన అందాల జాతిరత్నం?