రూ.39 లక్షల కోట్లతో దేశ బడ్జెట్..
2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు రూ. 39 లక్షల కోట్లు మేరకు ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన బడ్జెట్ ను నిర్మలా లోక్ సభలో ప్రవేశపెట్టారు. దాదాపు గంటన్నర పాటు ఈ బడ్డెట్ ప్రసంగం సాగింది. ఈ బడ్జెట్ ద్వారా తమకు మేలు చేకూర్చే నిర్ణయం వస్తుందని ఆశించిన ఎంతో ఆశగా ఎదురు చూసిన వేతన జీవులకు మాత్రం ఈ సారి నిరాశే ఎదురైంది. ఆదాయ పన్ను మినమాయింపులపై ఎలాంటి ప్రకటన రాలేదు. 5జీ సేవలు, ఈ – పాస్ పోర్ట్, క్రిఫ్టో కరెన్సీ పై ట్యాక్స్, డిజిటల్ కరెన్సీ, ఐటీ రిటర్న్ దాఖలులో మరో మినహాయింపు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిడక్షన్ పెంపు, విద్యార్థుల కోసం వన్ క్లాస్.. వన్ ఛానల్ మొదలైనవి ఈ బడ్జెట్ లో కీలక ప్రకటనలుగా నిలిచాయి. అయితే ఈ బడ్జెట్ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు పెరిగితే, మరికొన్నింటి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
పెరిగేవి, తగ్గేవి వస్తువు ధరలు ఇవే!
ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రభావంతో ఏ వస్తువులు ధరలు పెరగనున్నాయి, ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయో అన్నదానికి క్లారిటీ వచ్చింది. గొడుగులు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్లాస్టిక్ ఐటమ్స్, ఫర్టిలైజర్స్, ఐరన్, స్టీల్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్గానిక్ కెమికల్స్ వంటివి పెరిగే వస్తువుల జాబితా ఉన్నాయి. అలానే వస్త్రాలు, నగలు, మొబైల్ ఫోన్స్, మొబైల్ ఛార్జర్, చెప్పులు, స్టీల్ స్క్రాప్స్ వంటి వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
Must Read:-విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తప్పదన్న నిర్మలా సీతారామన్.. రగిలిపోయిన కార్మిక సంఘాలు











