యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయాలి అనుకున్నారు. అయితే.. కరోనా కారణంగా వాయిదా పడడం తెలిసిందే. అయితే.. ఆర్ఆర్ఆర్ వలన మూడు సంవత్సరాల పాటు మరో సినిమా చేయకుండా ఈ సినిమాకే ఫిక్స్ అయ్యారు ఎన్టీఆర్.
అయితే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డారని.. తన తదుపరి సినిమాల విషయంలో ప్లాన్ మార్చారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే… ఆర్ఆర్ఆర్ విడుదల గురించి క్లారిటీ లేకపోవడంతో ఆర్ఆర్ఆర్ విడుదల కాకుండానే.. కొరటాలతో చేయనున్న మూవీ షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. ఈసారి రెండు సినిమాలు ఒకేసారి చేయాలి అనుకుంటున్నాడని సమాచారం.
కొరటాల శివతో ఓ సినిమా.. మరి.. మరో సినిమా ఎవరితో చేయనున్నాడు అంటే.. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన బుచ్చిబాబు సానా పేరు గట్టిగా వినిపిస్తోంది. బుచ్చిబాబు ఎప్పుడో ఎన్టీఆర్ కి కథ చెప్పడం.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బుచ్చిబాబు సినిమాను కూడా ఎన్టీఆర్ పట్టాలెక్కించాలి అనుకుంటున్నాడని సమాచారం. త్వరలో అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.











