‘ఆర్.ఎక్స్ 100’ మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో కార్తికేయ. ఈ సినిమా తెచ్చిపెట్టిన భారీ క్రేజ్ తో అతడ్ని అవకాశాలు వెల్లువలా తాకాయి. అయితే మొదటి సినిమా తర్వాత కార్తికేయ నటించిన ఏ ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. అయినప్పటికీ అతడికి అవకాశాలు మాత్రం ఆగలేదు. ప్రస్తుతం తాజా చిత్రం ‘చావుకబురు చల్లగా’ సినిమా మీదే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు కార్తికేయ.
కౌశిక పెగళ్ళపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కాబోతోతుండడంతో .. హీరో కార్తికేయ .. తనే స్వయంగా ఈ సినిమా ప్రచారానికి బరిలోకి దిగాడు. హైద్రాబాద్ మెట్రోలో ‘చావుకబురు చల్లగా’ ప్రచారానికి బైలు దేరి వెళ్ళిన బస్తీ బాలరాజు .. ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ దగ్గర తన సినిమా భారీ పోస్టర్ అంటించి.. రైతు బజార్ లోని జనంతో సందడి చేశాడు. అతడితో జబర్దస్త్ మహేశ్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి.. ‘చావుకబురు చల్లగా’ పోస్టర్ తో కూడిన ఓ పెద్ద బెలూన్ ఎగరేశారు. మీ అభిమాన థియేటర్స్ లో ఈ నెల 19న వస్తోన్న చావుకబురు చల్లగా సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అని జనానికి విజ్ఞప్తి చేశారు.
శవాల్ని తరలించే అంబులెన్స్ డ్రైవర్ గా .. మాస్ కేరక్టర్ లో బస్తీ బాలరాజు గా నటిస్తున్న కార్తికేయ .. విడో అయిన ఓ అమ్మాయిని ప్రేమించి.. ఆమె వెంట పడతాడు. ఆ క్రమంలో జరిగే పరిణామాలతో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా చావుకబురు చల్లగా తెరకెక్కింది. లావణ్యా త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా మురళి శర్, ఆమని ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా కార్తికేయకు ఏ రేంజ్ లో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- అఫీషియల్ : కార్తికేయ హీరో.. సుకుమార్ నిర్మాత