మైనర్ బాలిక అత్యాచార కేసులో టిక్ టాక్ స్టార్ భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మైనర్ బాలిక అత్యాచార కేసులో భార్గవ్ అరెస్ట్ అయ్యాడనే వార్తలు బయటకు రాగానే… చాలా మంది ఓ మై గాడ్ ఫేం నిత్య ఫొటోలను షేర్ చేశారు. భార్గవ్, నిత్య కలిసి ఓ మై గాడ్ అనే వీడియోలను చేయడమే ఇందుకు కారణం. భార్గవ్ అరెస్ట్ నేపథ్యంలో ఎక్కువగా నిత్య పేరు వినిపించడంతో… భార్గవ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తన ఫొటోలు, వీడియోలు షేర్ చేయొద్దంటూ.. తన తల్లితో కలిసి మరో వీడియో విడుదల చేసింది.
Must Read ;- టిక్ టాక్ భార్గవ్.. ఇదేం పాడు పని : మైనర్ బాలికను లోబర్చుకొని, గర్భవతిని చేసి..!