టిక్ టాక్ భార్గవ్… తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. డిఫరెంట్ వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు. భార్గవ్ వీడియోలకు లక్షల్లో వ్యూయర్స్ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ పెందూర్తి వేపగుంటకు చెందిన ఓ మైనర్ బాలిక టిక్ టాక్ వీడియోలు చేస్తుండేది. ఈ క్రమంలో కొత్తవలసకు చెందిన చిప్పాడ భార్గవ్ కు పరిచయమైంది. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ చేస్తానని నమ్మించాడు. దీంతో ఆ అమ్మాయి చనువుగా మెలిగింది. అన్నయ్యా అంటూ కూడా పిలిచేది. చనువుగా మెలగడంతో మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. దీంతో 14 ఏళ్ల మైనర్ బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని టిక్ టాక్ భార్గవ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఫోక్సో చట్టం కింద భార్గవ్ పై కేసు నమోదు అయ్యింది.
దేశం గర్వించదగ్గ సీఎం.. చంద్రబాబు రికార్డు పాలనపై మోదీ ప్రశంసలు..!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ అసెంబ్లీ...