ఇంటిపన్ను కట్టాలంటూ ప్రభుత్వ అధికారులే ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నారు.ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని కామనగరువు, ఈదరపల్లి పంచాయతీల్లో చోటుచేసుకుంది. పన్నులు చెల్లించకుంటే ప్రభుత్వ పధకాలు నిలిపివేయడంతో పాటు, పన్నుకు సరిపడా ఆస్తులను జప్తు చేస్తామంటూ అధికారులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు.కాగా అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.ఇటువంటి పాలన గతంలో ఎన్నడూ చూడలేదని, పన్నులు చెల్లించడం ఆలస్యం అయితే ఆస్తులను జప్తు చేస్తామని చెప్పడం అధికారుల బరితెగింపును ఉదాహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హెచ్చరిస్తున్నారు.
Must Read:-కోస్తా జిల్లాల్లో సత్తా చాటిన టీడీపీ.. వైసీపీ నేతల్లో కలవరం