ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ విద్వంశాలు కొనసాగుతున్నాయి.తన పాలనను ప్రజా వేధిక కూల్చివేతలతో ప్రారంభించిన జగన్ అదే తీరును కొనసాగిస్తున్నాడు. తాజాగా కడప నగరంలోని మునిసిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న అన్నా క్యాంటీన్ ను గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి వేళలో అధికారులు కూల్చివేశారు.గత తెలుగుదేశం హయాంలో పెద ప్రజలకు ఉపయోగపడుతుందనే సదుద్దేశ్యంతో 25 లక్షల రూపాయల వ్యయంతో ఈ అన్నా క్యాంటీన్ ని నిర్మించారు. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్ లను మూసివేసింది.కాగా కడప నగరంలోని అన్నా క్యాంటీన్ ను నిన్న మొన్నటి వరకు అధికారులు కోవిడ్ కేంద్రంగా ఉపయోగించారు. ప్రస్తుతం ఆ భవనాన్ని అధికారులు నేలమట్టం చేశేశారు. కాగా అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇటువంటి చర్యల ద్వారా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే అని మండిపడుతున్నారు.
Must Read:-జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన