కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నల్లపురెడ్డిపల్లెలో కాల్పులు కలకలం సృష్టించాయి. వైసీపీకి చెందిన పార్థసారథిరెడ్డిని అతని బంధువు ప్రసాద్‌రెడ్డి తుపాకీతో కాల్పి చంపాడు. తరవాత అదే తుపాకీతో ప్రసాద్‌రెడ్డి కూడా కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని తెలుస్తోంది. గాయపడిన ప్రసాద్ రెడ్డిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ, ఆస్తి తగాదాలే కాల్పులకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అంతా ఒకేపార్టీ వారే..
నల్లపురెడ్డిపెల్లెలో అంతా వైసీపీ వారు, రెడ్డి సామాజికవర్గం వారు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ గ్రామంలో ఎలాంటి పార్టీ గొడవలు లేవని తెలుస్తోంది. పార్థసారధిరెడ్డి, ప్రసాద్ రెడ్డి ఇరువురు కూడా బంధువులే. వారి మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయని తెలుస్తోంది. నిన్న పార్థసారధిరెడ్డి కత్తితో ప్రసాద్‌రెడ్డిని బెదిరించినట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం లైసెన్సుడు గన్‌తో ప్రసాద్ రెడ్డి పార్థసారధిరెడ్డిపై దగ్గర నుంచి కాల్పులు జరపడంతో అతను సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. విషయం పోలీసులకు తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
Must Read ;- మామిళ్లపల్లె పేలుడు కేసులో వైఎస్ ప్రతాప్ రెడ్డి అరెస్టు











