ముందే లెక్కలేసుకున్నారు. స్కెచ్ రెడీ చేసుకున్నారు. అర్ధరాత్రి యాక్షన్ ప్లాన్ మొదలెట్టారు. ముందు మేడమ్‌ను ఎంట్రీ చేయించారు. ఆ తర్వాత ఒక్కోదానిపై పట్టు సంపాదించాలని చూశారు. వేలం లేదా అమ్మకం పేరుతో భూములను లాగేయాలని ప్లాన్ చేశారు. వారిని కేవలం న్యాయస్థానాలు మాత్రమే ఆపగలిగాయి. కొండలకు కొండలే లేపేద్దామనుకున్నారు.కాని కుదరలేదు. వారి ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. గజపతి రాజుల సంస్థానాల ఆస్తులను కొల్లగొట్టాలనుకున్నవారు భంగపడ్డారు. హైకోర్టు జీవోలను కొట్టివేయడంతో బ్రేక్ పడింది.అయితే ఇది తాత్కాలికమే… ఏపీ ప్రభుత్వం ఆ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లనున్నది.
విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ బ్యాచ్ స్కెచ్
గజపతిరాజుల కుటుంబానికి సంబంధించిన ఈక్వేషన్లన్నీ బాగా స్టడీ చేశారు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ బ్యాచ్. అందులో వారికి దొరికింది ఆనందగజపతిరాజు రెండు వివాహాలు చేసుకోవడం.. వారి మధ్య వాటాల లావాదేవీలు.. గొడవలు. దానినే ఆయుధంగా చేసుకున్నారు. ఆనందగజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయితను తీసుకొచ్చారు. ఆమెను రాత్రికి రాత్రి మాన్సస్ ట్రస్ట్ ఛైర్మన్‌గాను, సింహాచల దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గాను నియమించేశారు. అప్పటికే ఆ పదవిలో ఉన్న మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును తొలగించినట్లు ఉత్తర్వులిచ్చేశారు. ఆ ఉత్తర్వులు వారికి అంది తెలుసుకునేలోపే.. సంచయిత గజపతిరాజు ప్రమాణస్వీకారం కూడా అయిపోయింది.
ఇక అప్పటి నుంచి వారి ప్లాన్ అమల్లోకి వచ్చింది. ముందు సింహాచల దేవస్థానం కింద నిరుపయోగం ఉన్న భూములను అమ్మాలనే ప్రతిపాదన తెచ్చారు. వారు అమ్మేటప్పుడు.. వాటిని ఈ బ్యాచ్ మనుషులే కొనుగోలు చేసుకునేలా సెటప్ కూడా చేసుకున్నారు. కాని తీవ్రంగా విమర్శలు రావడం.. టీడీపీతో సహా మిగతా ప్రతిపక్షాలు ఆందోళన చేయటంతో వెనక్కు తగ్గారు. అయినా అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.
విజయనగరంలోని ఎమ్మార్ కాలేజిని..
ఇది కాక.. విజయనగరంలోని ఓ కాలేజిని మాన్సస్ ట్రస్ట్ ఎన్నాళ్ల నుంచో నడిపిస్తోంది.ఇప్పుడు అది అవసరం లేదని.. ఆ ప్రొపర్టీ మొత్తాన్ని ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నట్లు సంచయిత ప్రకటించారు. వారి ప్లాన్ ఏంటంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాక…దానిని మళ్లీ వేరే ప్రైవేటు సంస్థకు లీజు పేరుతో ఇచ్చేస్తారు.ఎంతో విలువైన భూమిని ఒక కార్పొరేట్ సంస్థకు అప్పచెప్పి.. ఆ సంస్థ నుంచి వీరు కిక్ బ్యాక్ తీసుకునేలా ప్లాన్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. అది కూడా కోర్టు జోక్యంతో ఆగింది.
లెక్కప్రకారం మళ్లీ అశోక్ గజపతిరాజే..
ఇలా అన్నిటికి అశోక్ గజపతిరాజు న్యాయస్థానానికి వెళుతూనే ఉన్నారు.ఎట్టకేలకు ఇప్పుడు సంచయితను నియమిస్తూ ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు లెక్కప్రకారం మళ్లీ అశోక్ గజపతిరాజే విజయనగరంలోని ఓ కాలేజిని ఛైర్మన్‌గా ఉండాలి. సింగిల్ బెంచ్ ఇఛ్చిన ఈ తీర్పుపై జగన్ సర్కార్ డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేస్తోంది. ఈలోపు అశోక్ గజపతిరాజు రాకుండా వారి ప్రయత్నాలు వాళ్లు చేస్తారు.
కాని కేవలం ఆ సంస్థానం ఆస్తులను కొల్లగొట్టడానికి ఇంత పెద్ద ప్లాన్ వేశారంటే.. రాష్ట్రంలోని మిగతా విలువైన ఆస్తుల పరిస్ధితి ఏంటి? ప్రతిపక్షాలన్నీ విమర్శించినా పట్టించుకోలేదు..పట్టించుకోరు కూడా. న్యాయస్థానాలు యాక్టివ్‌గా లేకుంటే..ఆ అవకాశం కూడా లేకపోతే.. ఈపాటికి ఆ ఆస్తులన్నీ వారి చేతిలోనే ఉండేవి.
Must Read ;-న్యాయం గెలిచింది: అశోక్ గజపతిరాజు