పాలకుడే దొంగలా మారితే.. ప్రజాస్వామ్యం అరణ్యాలలో అరుణోదయం చూడాల్సిందేనా..? అంటే అవుననే సమాధానాలు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
ఏపీలో ఆర్ధిక ఉగ్రవాది.., నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తి పాలన పగ్గాలు చేపట్టడం దురదృష్టకరం…, జాతికి శాపం. ఆ శాప ప్రభావాన్ని నేడు ప్రజలు అనుభవిస్తున్నారు. ఆస్తులను, ప్రాణాలను కాపాడుకునేందుకు ఏపీ ప్రజలు నిత్యం చేస్తున్న అమానవీయ పోరాటంక దేశం చూస్తున్నే ఉంది. ఇదిలా ఉంట ప్రస్తుతం రాజ్యాంగ కల్పించిన ఓటు హక్కును కాపాడుకునేందుకు ప్రజలు కొత్త పోరాటం మొదలుపెట్టాల్సిన దుస్ధితి దాపురించింది. నకిలీ ఓట్ల చేర్పులు.., మార్పులపై ఏపీ ప్రభుత్వం.., వైసీపీ సాగిస్తున్న నీచ రాజకీయ క్రీడా.. దేశ సౌభ్రాతృతాన్ని ప్రశ్నించడం కాదా..?
ఏపీ వ్యాప్తంగా దాదాపు 35 లక్షల దొంగ ఓట్లు చేర్పించారని విపక్షాలు ఆధారాలతో సహా బయటపెట్టిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేసిన పట్టించుకున్న దాఖలు లేవు. బోగస్ ఓట్లు చేర్పిస్తున్నారని.., జీవో డోర్ నెంబర్ తో వేలల్లో ఓట్లు నమోదు చేస్తున్నారని.., వైసీపీలో ఒకే వ్యక్తిపై వందల కొద్ది ఓట్లు నమోదు అవుతున్నాయని ఫిర్యాదులు అందించిన ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి చీమకుట్టిన మాదిరిగానైనా లేకపోవడం గమనార్హం. అధికారులను అడ్డంపెట్టుకుని తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఫిర్యాదు చేసినా.. రాష్ట్ర ఎన్నికల సంఘం మొద్దునిద్రపోతోంది. ఈ కుట్రలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి.. ఘాతుకాలకు పాల్పడుతున్న అధికారులను సస్పెండ్ చేస్తుంటే.. నిద్ర నటిస్తున్న ఏపీ ఎన్నికల సంఘం నేడు మేల్కొంటుంది.
ఏపీలో ఓటరు జాబిత సిద్దమైంది.. ఇక మార్పులు .., చేర్పులుంటే పరీక్షించుకోవాలని ప్రజలకే వదిలేశారు. అందుకు డెడ్ లైన్ సైతం విధించారు. డిసెంబరు 9 వరకు ఓటర్లు ఫిర్యాదు తెలియజేయాని.., మీ ఓట్లును మీరే కాపాడుకోవాలని.., ఆ తరువాత మా బాధ్యతకాదని చేతులెత్తేస్తోంది. ప్రతి గ్రామంలో, వార్డుల పరిధిలో వందల సంఖ్యలో వైసీపీ దొంగ ఓట్లు చేర్పించారని.., వాటిని పూర్తి స్ధాయిలో విచారించిన తరువాతే ఓటరు జాబితాను ముద్రణకు తుది నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం, జనసేన నేతలు మొత్తుకుంటున్నా.. ఈ నెల 9 వరకు డెడ్ లైన్ విధించి.. హడావుడిగా ఓట్ల జాబిత ముద్రణకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇది ఎంత వరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం.., స్వతంత్ర సంస్ధ అయిన ఎన్నిక కమిషనే ఇటువంటి చర్యలను పురికొల్పుతుంటే.. సభ్య సమాజం ఎటుపోవాలి. ఈ విధంగా చిత్ర హింసా.., అణిచివేత.., అవినీతి.., దౌర్జన్యాలు ఏపీలో పెరిగిపోతుంటే.. యువత, జర్నలిస్టులు.., మేధావులు.., సోషలిస్టులు ఎక్కడిపోవాలి..? సంస్కృతిని.., నాగరికతను మరచి.. అడవిబాట పట్టలా..? ఉద్యమాలకు తిరిగి పురుడుపోయాలా..?అన్న ప్రశ్నలు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా వినిపించడం శోచనీయం.











