యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ మరో క్రెడిట్ కొట్టేశారు. పాన్ ఇండియా హీరోల జాబితాలో మూడో స్థానాన్ని విజయ్ దక్కించుకున్నాడు. విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ లో అతనికున్న ఫాలోయింగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తెలుగులోనే కాదు జాతీయ స్థాయిలో కూడా విజయ్ సత్తా చాటుతున్నాడు. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ దక్కించుకున్న ఫస్ట్ సౌత్ హీరోగా రికార్డు కొట్టిన విజయ్ ఇప్పుడు మరో మైలురాయి అందుకున్నాడు.
ఇండియాలోని టాప్ 50 మెస్ట్ డిజైరబుల్ మెన్ ల లిస్ట్ లో విజయ్ ఏకంగా మూడో స్థానం దక్కించుకోవడం విశేషం. మొదటి స్థానంలో షాహిద్ కపూర్, రెండో స్థానం లో రణ్ వీర్ సింగ్ ఉండగా మిగతా బాలీవుడ్ హీరోలను కిందకు నెట్టి విజయ్ మూడో స్థానం సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మేన్ గా వరుసగా 2018, 2019 సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న రౌడీ స్టార్ ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్ లో టాప్ 3 ప్లేస్ కైవసం చేసుకోవటం అతని క్రేజ్ కు నిదర్శనం. అతను చేసిన సినిమాలకు ,తన అటిట్యూడ్ కు నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ అవుతున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న మూవీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆ సినిమా పై భారీ అంచనాలున్నాయి.











