ఏదైనా మార్పు సాధ్యంకావాలంటే… చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే సరిపోదు! పెద్ద విస్పోటనమే జరగాలి… అప్పుడే అనుకున్న లక్ష్యాలను అందుకోగలం…!! పాతనీరు బయటకు వెళ్లిపోతేనే. కొత్త నీరు వచ్చి ప్రవాహంలా మొదలవుతుంది!!. ఇప్పుడు టీడీపీకి కూడా యువరక్తం కావాలి!! యువతతోనే మార్పు సాధ్యమని భావించిన పార్టీ నాయకత్వం యూత్ నాయకులకు, లీడర్లకు ప్రాధాన్యం ఇస్తోంది. యువతరంగాలతో టీడీపీ నూతనోత్సహాం నింపుతోంది. 1983లో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ యువకుల్ని ప్రోత్సహహించినట్టు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ యువ రక్తానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కేసినేని శ్వేత, ప్రణవ్ గోపాల్, బండారు శ్రవణి, భరత్ తో పాటు ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ రాజు, బొజ్జల సుధీర్ లాంటి యువకులతో టీడీపీ నూతనోత్సహం నింపుకుంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తమదైన ముద్రవేస్తున్నారు. అదిష్టానం ఏ పిలుపు ఇచ్చినా.. వెంటనే స్పందిస్తూ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ, ప్రభుత్వంపై పోరాడుతున్నారు.
Also Read : రాజకీయాల్లో యువత భాగస్వామ్యం కావాలి..