సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇతిహాస ప్రణయ గాథ ‘శాకుంతలం’. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్టింగ్స్, గ్రాఫిక్స్ .. ‘శాకుంతలం’ చిత్రానికి హైలైట్స్ కాబోతున్నాయి. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ తనయ నీలిమ నిర్మిస్తున్న ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళ హీరో దేవ్ కమల్ నటిస్తుండగా.. దూర్వాస మహామునిగా విలక్షణ నటుడు మోహన్ బాబు నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక ఇందులోని మరో ప్రధాన పాత్ర కు తమిళ బ్యూటీ అదితీ బాలన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.
‘అరువి’ అనే తమిళ సినిమాలో అద్భుతంగా నటించిన అదితీ బాలన్.. ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ లో ఇటీవల జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఇందులో ఆమె శకుంతల ప్రధాన చెలికత్తె ప్రియంవదగా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. యన్టీఆర్ నటించిన అప్పటి శకుంతల సినిమాలో టైటిల్ రోల్ ను బి.సరోజా దేవి పోషించగా.. ఆమె చెలికత్తె ప్రియం వదగా ఊర్వశి శారద నటించి మెప్పించింది. మహాభారతంలోని ఆదిపర్వంలోని శకుంతల దుష్యంతుల ప్రణయ గాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నప్పటికీ.. దీనికి యన్టీఆర్ ‘శకుంతల’ సినిమాను రిఫరెన్స్ గా తీసుకుంటున్నారు గుణశేఖర్. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో ప్రియంవదగా అరువి బ్యూటీ ఏ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.
Must Read ;- దుశ్యంతుణ్ణి పరిచయం చేసిన అందాల శకుంతల