పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన ఫామ్ హౌౌస్ లోనే ఆయనకు చికిత్స జరుగుతోంది. జ్వరం, జలుబు రావడంతో దాదాపు వారం రోజులుగా ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ‘వకీల్ సాబ్’ బృందాన్ని కరోనా భయం వెంటాడుతోంది. ఈ చిత్ర బృందంలో కొందరికి ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో నటించిన నివేదా ధామస్ కు కరోనా వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు పవన్ కళ్యాణ్ తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన బృందంలో కొందరికి కరోనా లక్షణాలు వచ్చాయి. దాంతో ఆ బృందమంతా హోం ఐసోలేషన్ లో ఉంది.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సినిమా జనులంతా భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అసలు ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదలై వంద కోట్లు వసూలు చేయడం కూడా విశేషమే. అయితే పవన్ కళ్యాణ్ ఆ సినిమా ప్రచార కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఆయన వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా రావడంతో ఆయన హోం ఐసోలేషన్ లో ఉండాల్సి వచ్చింది. తమ అభిమాన హీరోకు కరోనా రాకూడదని అభిమానులు కోరుకున్నారు. కానీ ఇప్పుడు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ వార్తలతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు.
నిపుణులైన వైద్య బృందం ఆధ్వర్యంలో చికిత్స
పవన్ కళ్యాణ్ కు కరోనా బయటపడటంతో నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతోంది. పవన్ కళ్యాణ్ వదిన సురేఖ, రామ్ చరణ్, ఉపాసన ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నారు. అపోలో నుంచి ప్రత్యేక వైద్య బృందం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోంది. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తానని పవన్ కళ్యాణ్ తెలిపినట్టు జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
Must Read ;- ఐసీయూ లో బండ్ల గణేశ్.. కరోనా పాజిటివే కారణమా?












