కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోన బారిన పడుతున్నారు. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కొవిడ్ ఎఫెక్ట్ పడింది. డాక్టర్ల సూచన సూచన మేరకు హోం క్వారంటైన్‌లో వెళ్లారు. అయితే గత కొన్నిరోజులుగా పవన్‌కళ్యాణ్‌తో కాంటాక్ట్ అయినవారు కరోనా బారిన పడటంతో, వెంటనే ఆయన అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లో ఉండాలని డాక్టర్లు చెప్పడంతో హోం క్వారంటైన్ కు పరిమితమయ్యారు. ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే… టెలి కాన్ఫరెన్స్, వీడియో కాల్స్ ద్వారా సంప్రతింపులు జరుపుతున్నారు.
Must Read ;- రేపటి నుంచి వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరలు పెంచవద్దు.. హైకోర్టు