కరోనా తీవ్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయటం లేదా వాయిదా వేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. 15 లక్షలకు పైగా విద్యార్థులు 10, ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ కేసుల తీవ్రత రోజు రోజుకూ ఎక్కువవుతుడటంతో పాటు మరణాల రేటు పెరుగుతోందని, ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేకపోవడం, వెంటిలేటర్ల కొరత అధికంగా ఉందని నారా లోకేశ్ అన్నారు. యుద్ధ ప్రతిపాదికన ప్రభుత్వం పని చేయాలని ఆయన రిక్వెస్ట్ చేశారు.
Must Read ;- కరోనా రోగులతో బెడ్లు ఫుల్.. అన్నిచోట్ల ఆక్సిజన్ టెన్షన్











