పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలను ఓకే చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే పవన్ చేస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ 80 శాతం కంప్లీట్ అయింది. మిగిలిన షూటింగ్ కూడా ఈమధ్యనే మొదలై శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత పవన్ క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఒక సినిమా చేయబోతున్నారు. హరీష్ శంకర్ పవర్ స్టార్ కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడని వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు ఈ సినిమా కథపై సాలిడ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని నిముషాల పాటు డాన్ గా కనిపిస్తారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అది కూడా ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ లో మాత్రమే డాన్ గెటప్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఆయన ఒక సరికొత్త లుక్ తో కనిపిస్తాడని టాక్. డైరెక్టర్ హరీష్ డాన్ పాత్ర పవన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసాడని సమాచారం. 30 నిమిషాలు పాటు పవన్ డాన్ గా కనిపిస్తారని, ఆ 30 నిమిషాలు ఫాన్స్ కు పక్కాగా కిక్కెకించేలా ఉంటుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇంతకు ముందు ‘బాలు, పంజా’ చిత్రాల్లో కూడా పవర్ స్టార్ డాన్ గా నటించి అభిమానుల్ని మెప్పించారు.
అసలే పవన్ – హరీష్ కాంబో అంటే ఫాన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి. దానికి కారణం గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ అని వేరు చెప్పనక్కర్లేదు. పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమా ‘గబ్బర్ సింగ్’. పవన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేశాడు. కాగా హరీష్ – పవన్ చేయబోతున్న రెండోవ సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. అందులోనూ ఈ సినిమాలో డాన్ సీక్వెన్స్ ఉందనే సరికి అభిమానుల అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఇక ఈ చిత్రంలో కథానాయకిగా పూజా హెగ్డే పేరు వినబడుతోంది. ఈ డాన్ పాత్ర విషయంలో ఒక క్లారిటీ రావాలంటే అభిమానులు ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే మరి.