దత్త పుత్రుడు అంటే చాల మంచ్చి పదం అని మన అందరికి తెలుసు.. అయితే కొందరికి దత్తపుత్రుడు అంటే పుండు మీద కారం చెల్లినట్టే ఉంటుంది. ఆ పదం వినడానికి కూడా ఇష్టపడరు. అసలు ఈ దత్తపుత్రుడు వ్యవహారం ఏంటో చూదాం పదండి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి పవన్ కళ్యాణ్ పై సెన్సషనల్ కామెంట్స్ చేశారు. మాటలు తూటాలు పేల్చారు పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు అంటూ సంబోధించడమే కాకుండా మరోసారి భార్యల ప్రస్తావని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, అలాగే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని, బీజేపీ దగ్గర తొత్తుగా పనిచేస్తాడని , ప్యాకేజీ తీసుకొని మాట్లాడుతాడని, ప్యాకేజీకోసమే పార్టీ స్థాపించాడని సెన్సషనల్ కామెంట్స్ చేసాడు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇదంతా చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటా అని ఆరా తీస్తే… పవన్ కళ్యాణ్ ఈమధ్య చేసిన కొన్ని సంచలనమైన కామెంట్స్ అని అర్థమైంది.
రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పొత్తులతో వెళ్ళబోతున్నానని చెప్పడంతో టిడిపి జనసేన కలిసి ఎన్నికలకి వెళ్ళబోతున్నాయి అని చెప్పడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షాక్కుకు గురయ్యాడు. ఇంతకాలం ఏపీలో పార్టీలన్నీ ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు తనదే అని ధీమాగా ఉన్న సీఎం జగన్ కు పవన్ పదేపదే పొత్తుల ప్రస్తావన తీసుకురావడంతో పాటు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కలవడం కూడా నచ్చలేదని చెప్పాలి. అయితే ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలు బట్టి చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఓటమిని ముందుగానే ఊహించే ఈ విధంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలి అంటూ సవాళ్లు విసురుతున్నారని. పవన్ పొత్తుల్లో భాగంగా ముందుకు వెళితే తన పదవికి భారీ దెబ్బ కొట్టడం ఖాయమని జగన్మోహన్ రెడ్డితో పాటు వైసిపి నాయకులు కూడా భావిస్తున్నట్లు అర్థమవుతుంది.
మీరు నన్ను ఇంకోసారి దత్తపుత్రుడు అని పిలిస్తే, నేను మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడు అని పిలవాల్సి ఉంటుంది అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మిమ్మల్ని చెర్లపల్లి షటిల్ టీమ్ అని కూడా పిలుస్తాను’’ అని పవన్ కల్యాణ్ సవాలు చేసారు.. సీబీఐకి, అవినీతి కేసులకు సంబంధించిన ఏదైనా జగన్ మోహన్ రెడ్డికి ఆచితూచి వ్యవహరిస్తూనే ఉంటారు. దీనిపై ఇప్పటి వరకు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడూ స్పందించకపోవడంతో ముఖ్యమంత్రికి, ఆయన పార్టీకి ఈ అంశం ఎంత ఇబ్బందికరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ దత్త పుత్రుడు జగన్ మోహన్ రెడ్డి ఆహ్? నేనా అని ఆవేశంతో ఊగిపోయారు.