పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీలో వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ లో ఆయన నటిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బర్త్ డే కానుకగా ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే క్రిష్ దర్శకత్వంలో చేసేందుకు ఓకె చెప్పారు. మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా నటించనున్నారు. ఈ సినిమాకి విరూపాక్ష అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అభిమానుల కోసం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫేస్ రివీల్ చేయకుండా వీరుడి గెటప్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించని ప్రకటన రావడం అభిమానులనే గాక సినీ లవర్స్ షాక్ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’తో సత్తా చాటిన సురేందర్ రెడ్డి గత కొన్ని రోజులుగా పవన్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పవన్ బర్త్ డే సందర్భంగా చిత్ర నిర్మాత ఈ విషయాన్ని తెలియచేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. రామ్ తాళ్లూరి పవర్ స్టార్ కు మంచి స్నేహితుడనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కథను వక్కంతం వంశీ అందిస్తున్నారు. సురేందర్ రెడ్డి సినిమాలలో ఎక్కవ శాతం కథలను వంశీ అందించారు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన వంశీ స్నేహితుడు సూరి కోసం తిరిగి కథను ఇవ్వడం విశేషం. ఈ సినిమాను విజయదశమి కానుకగా లాంచ్ చేయాలని నిర్ణయించారు.











