ఏపీలో వింత రూల్స్ ప్రజలను తీవ్ర వెతలకు గురి చేస్తున్నాయి. దిశా యాప్ డౌన్ లోడ్ పేరుతో పోలీసులు చేస్తున్న ఒత్తిడి ప్రజా హక్కులకు భంగవాటిల్లుతోంది.
ప్రజాభిప్రాయాల మేరకే ప్రభుత్వాలు నడుస్తాయి. అలా కానప్పుడు అధికారాన్ని ఓడగొట్టి ఇంటికి ఎలా పంపాలో ప్రజలకు బాగానే తెలుసు. ప్రజలకు ఇష్టంలేని పనులను ఒత్తిడితో రుద్దడంపై ఆందోళనకు దారి తీస్తోంది. ఇదే తరహా దిశాయాప్ డౌన్లోడ్ విషయంలో పోలీసుల చేస్తున్న హడావుడికి ప్రజలకు తిరగబడుతున్నారు. ఒత్తిడి చేస్తే సహించేది లేదని పోలీసులకు నేరుగా చెప్పడంతో విషయం సమస్యాత్మకంగా మారుతోంది. దిశ చట్టం తీసుకొచ్చిన జగన్.. అసలు ఆ చట్టం మహిళల రక్షణలో ఏ పాత్ర పోషిస్తోందో అందరికీ తెలిసిందే. జగన్ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా మహిళలపై దాడులు.., అత్యాచారాలు అనేకమన్నది విపక్షాల వాదన. వీటిని దిశ చట్టంతో కప్పి పుచ్చే ప్రయత్నం చేసినా.. కానీ జగన్ ప్రభుత్వానికి అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు. దిశ చట్టం దేవుడెరుగును .. కానీ యాప్ డౌన్లోడ్ పేరుతో పోలీసులు స్పందిస్తున్న తీరు.. సామాన్యులకు సైతం ఆగ్రాహావేశాలను తెప్పిస్తోంది.
దిశ యాప్ అన్నది కేవలం మహిళా రక్షణ కోసం డిజైన్ చేసింది. మహిళల స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే.. అనుమానిత వ్యక్తులు, ప్రమాద సమయాల్లో ఉపయోగపడుతోందని ప్రభుత్వం చెబుతోంది. కానీ.. ఆ పరిస్ధితులను నుంచి మహిళలను రక్షించిన దాఖలు తక్కువే. కానీ ఉన్న ఫలంగా మహిళలతోపాటు పురషుల మొబైల్లో కూడా ఈ యాప్ ను బలవంతంగా డౌన్లోడ్ చేయించడం, ఓటీపీ చెప్పమనడంపై పలు అనుమానాలకు తావిస్తున్నాయన్నాయి. అనకాపల్లి జిల్లా రేగుపాలెం కు చెందిన భారత్ జవాన్ సయ్యద్ అలీముల్లా ఫోన్ లో దిశా యాప్ ను బలవంతంగా డౌన్ లోడ్ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించారు. డౌన్ లోడ్ అనంతరం ఓటీపీ చెప్పాలని ఒత్తిడి తీసుకురాడంతో నిరాకరించిన జవాన్ పై మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకుంది. అంతేకాక బలవంతంగా పరవాడ పోలీసు స్టేషన్ కు ఆయనను తరలించారు. మంగళవారపు సంతలో పోలీసులు దిశ సబ్ స్క్రిప్షన్ స్సెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్త్రీ,పురుష లింగభేదం లేకుండా అందిరి స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ ను ఎక్కించారు. ఇదే అక్కడ తీవ్ర ఘర్షణకు దారితీసింది.
దీనిపై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే సైనికుడికే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పోలీసులు గుండాల్లాగా సయ్యద్ పై దాడి చేయడం ఏమిటని నిలదీశారు. ఇలా పురుషుల మొబైల్స్ లో కూడా ఆ యాప్ ను బలవంతంగా డౌన్ లోడ్ చేయించడం పై పలు అనుమానాలకు తావిస్తున్నాయని లోకేష్ అనుమానం వ్యక్తం చేశారు.