దేశ రాజకీయాల్లో గతకొన్నిరోజులుగా జరుగుతున్న చర్చకు నేడు తెరపడినట్లు అయ్యింది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే కాంగ్రెస్ లో చెరబోతున్నారు, దాదాపు చెరిపోయారు అని జరుగుతున్న ప్రచారానికి ఆయనే తెర దింపారు. పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చెరబోవడం లేదని స్వయంగా ప్రకటించారు. అయితే దీనిపై అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి.
ఇన్ని రోజులు ప్రశాంత్ కిషోర్ తానంతట తానే కాంగ్రెస్ తలుపులు కొట్టారు అనే వాదన ఒకవైపు వినిపిస్తే, తాజాగా కాంగ్రెస్ లో చేరబోవడం లేదనే ఆయన ప్రకటన తర్వాత కొత్త చర్చ తెరపైకి వచ్చింది. తాను ఏనాడూ కాంగ్రెస్ తలుపులు కొట్టలేదని, తన అవసరాన్ని గుర్తినహీన కాంగ్రెస్ అధిష్టానం తనను పార్టీలోకి ఆహ్వానించింది అనేది ఆయన వాదన.
కాగా, పార్టీలోకి రావాలన్న కాంగ్రెస్ హైకమాండ్ ఆహ్వానాన్ని ఆమోదించలేకపోతున్నానని తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన ప్రకటన. తాను పార్టీలో ఉండడం కంటే సలహాదారుగా ఉండడమే అవసరమని ప్రశాంత్ కిశోర్ తన ప్రకటనలో స్పష్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మూలాల నుంచి పునర్ నిర్మాణం జరగాల్సి ఉందని ఆయన ఉద్ఘాటించారు. పార్టీ పునర్ నిర్మాణంలో కాంగ్రెస్ నాయకత్వం సమష్టిగా పనిచేయాలని పీకే స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్ ప్రకటన పై టి. కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న సోనియా గాంధీ ఆహ్వానాన్ని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) తిరస్కరించడం అనేది కేవలం అసత్య ప్రచారమని చెబుతున్నారు.ఇక పీకే కాంగ్రెస్ లో చెరకవపోవడం వెనుక కెసిఆర్ కుట్ర దాగుండాని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, ఇటీవల ప్రగతి భవన్ కు వెళ్లాక ప్రశాంత్ కిశోర్ మనసు మార్చుకున్నారని కొందరు టి. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో చేరకూడదన్న ప్రశాంత్ కిశోర్ నిర్ణయం వెనుక కారణాలేంటో తెలియవని ప్రస్తావిస్తున్న సీనియర్ నాయకులు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పీకే చేరిక అంశాన్ని కొందరు వ్యతిరేకించారని అంటున్నారు.