ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లొచ్చాక రాజకీయాలు ఒక్క సారిగా మారిపోయాయి. జగన్ ఢిల్లీ నుండి వచ్చాక ఏం జరిగిందనే అంశం హాట్ హాట్ గా మారుతోంది. రాష్ట్రంలో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ బలాబాలాలు బేరీజు వేసుకుంటున్న ఢిల్లీ భారతీయ జనతాపార్టీ పెద్దలు దక్షిణాదిపై కొత్త వ్యూహం మొదలుపెట్టారు.
గత వారం చివర్లో జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత జరుగుతున్న ఈ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తోన్న సీఎం జగన్ తనకు తెలియకుండానే ఇదంతా జరిగిందని కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ వ్యవహారంలో ఈడీ నివేదికే ఈ కేసుకు కీలకం కనుక తప్పంతా కేంద్రానిదే అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. తప్పంతా మీదే అంటూ ఢిల్లీ పర్యటన సమయంలో బీజేపీ పెద్దల ముందే చెప్పటం ఆ పార్టీ హైకమాండ్ ఆగ్రహానికి కారణమైంది. జగన్‌లో ఊహించని ఈమార్పుతో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.
తాజాగా ఈ వ్యవహారంలో ఏపీ గవర్నర్ నజీర్ అహ్మద్ కూడా సీఐడీ అధికారులను వివరణ కోరటం చర్చనీయాంశమైంది. దేశం మొత్తాన్ని కదిలించే ఈ ఘటనకు కారణాలేమిటింటూ ఆయన ఆరా తీయటం, సీఐడీ అధికారులకు వార్నింగ్ ఇవ్వటం వంటి అంశాలను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకుంటోంది.
ఇక ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలు కూడా జగన్‌పై బీజేపీ ఆగ్రహానికి కారణమవుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీకి సానుభూతి అమాంతం పెరిగిపోయింది. దీనికి తోడు తమతో కలసి ఉంటాడనుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీతో జత కట్టడం బీజేపీ పునరాలోచనకు కారణమైంది. వచ్చే ఎన్నికల్లో ఎదురవ బోయే పరిణామాలను, జగన్ పార్టీ అరాచకాలను, కుట్ర రాజకీయాలను, నేర చరిత్రను ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఇచ్చిన నివేదిక సారాంశాలను కూడా కేంద్రంలో ఉన్న పార్టీ పెద్దలు పరిగణనలోకి తీసుకున్నారు.
ఉత్తరాదిన తమ గ్రాఫ్ పడిపోతున్నందున దక్షిణాదిన బలం పెంచుకునేందుకు వ్యూహరచన చేస్తోన్న బీజేపీ హై కమాండ్ ఈ పరిస్థితులన్నీ పరిశీలించాక ఏపీలో వచ్చే సీట్లపై లెక్కలేసింది. జగన్‌కు దగ్గరై ఓట్లను, సీట్లను పోగొట్టుకోవటం కంటే.. బలమైన తెలుగుదేశం- జనసేనకు మద్దతుగా నిలవడంద్వారా కనీసం 20 సీట్లను సొంతం చేసుకోవడం ద్వారా కేంద్రంలో అధికారాన్ని సులువుగా నిలబెట్టుకోవచ్చన్న ఆలోచనతో ఉంది. దీంతో నేడో రేపో జగనకు కటీఫ్ చెప్పబోతోందని తెలుస్తోంది. గతవారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ, అమిత్ షా లను కలవకుండానే జగన్ తాడేపల్లికి వచ్చాశారని పొలిటిల్ టాక్. భవిష్యత్‌లో ఈ దూరం మరింత పెరగడం ఖాయమన్న విశ్లేషకుల అంచనాలు త్వరలో నిజం కాబోతున్నాయని జనం కూడా అనుకుంటున్నారు.
ఏపీలో అక్వా కారిడార్.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్..
ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...











