ప్రధానమంత్రి నరేంద్రమోడి జీవిత కథతో బాలీవుడ్ లో తెరకెక్కిన సినిమా ‘పి.యం.నరేంద్ర మోడి’. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ మే 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమాకి నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. చాలా మంది ఇది బయోగ్రఫీ కాదు.. హెగియోగ్రఫీ (యోగి జీవిత చరిత్ర) అని విమర్శించారు. ఎన్ని కామెంట్స్ వచ్చినప్పటికీ .. రూ. 8కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి దాదాపు రూ. 14కోట్ల వరకూ వసూళ్ళు దక్కాయి. నరేంద్ర మోడీగా నటించిన వివేక్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన పి.యమ్. నరేంద్రమోడి సినిమా.. త్వరలోనే రీరిలీజ్ కానుండడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఈ నెల 15 నుంచి థియేటర్స్ ను తిరిగి తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆ రోజున పి.యమ్.నరేంద్ర మోడి సినిమాను మరోసారి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. థియేటర్స్ రీ ఓపెన్ రోజున విడుదల కానున్న మొదటి సినిమా ఇదే అవడం విశేషం. సినీ క్రిటిక్ , విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ .. ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేశాడు.
IN CINEMAS NEXT WEEK… #PMNarendraModi – starring #VivekAnandOberoi in title role – will re-release in *cinemas* next week… OFFICIAL poster announcing the theatrical release… pic.twitter.com/NfGRJoQVFS
— taran adarsh (@taran_adarsh) October 10, 2020