తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపియూఎస్) తమ నిరసన గళాన్ని వినిపిస్తూ రోడ్డెక్కారు. బీఆర్కే భవన్‌ను ముట్టడించాలన్న వారి ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ప్రమోషన్లు, బదిలీలు వెంటనే చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 45 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసలైన వాళ్లని వదిలేది తోక సంఘాలను చర్చకు పిలిచారని మండిపడుతున్నారు. తెలంగాణ పిఆర్‌సీ నివేదికకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘం టీపీయూఎస్ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం నిరంకుసత్వాన్ని, మొండి వైఖరిని మాని వెంటనే 63 శాతం పిఆర్‌సీ ప్రకటించాలని కోరుతున్నారు. ఆందోళన నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు.
Must Read ;- కేసీఆర్ ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న ఉద్యోగులు











