‘వకీల్ సాబ్’ ముందుకు కొత్త కేసు వచ్చింది. మరి వకల్తా ఎవరు పుచ్చుకుంటారో చూడాలి. విషయమేమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాపై సుధాకర్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు. ఈ సినిమా కారణంగా తనను వేధిస్తున్నారన్నది అభియోగం. దీనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. ఆయన మాససిక వేదనకు కారణం ఏమిటంటే ఆయన ఫోన్ నంబర్ ను సినిమాలో ఉపయోగించడం. ఈ సినిమాలో నటి అంజలి ఓ సంస్థలో ఉద్యోగం చేస్తుంది.
ఆమెను ఆమె బాస్ ఉద్యోగం చేయమన్నప్పుడు ఎదురుగా ఉన్న ల్యాప్ ట్యాప్ లో ఓ అసభ్యకరమైన ఫొటో చూపిస్తాడు. దానికింద ఓ ఫోన్ నంబర్ కూడా ఉంటుంది. ఆ ఫోన్ నంబర్ ఈ సుధాకర్ అనే వ్యక్తిది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఆయన అదే పనిగా ఫోన్లు రావడం మొదలైందట. పైగా ఫోన్ చేసిన వారు బూతులు తిడుతున్నారట. తన అనుమతి లేకుండా తన ఫోన్ నంబర్ ను ఆ సినిమాలో వాడారన్నది సుధాకర్ ఆరోపణ.
అసలు సినిమాలో ఇలాంటి ఫోన్ నంబర్ వాడేటప్పుడు తమ యూనిట్ లోని వారి ఫోన్ నంబర్లే వాడుతుంటారు. మరి ఏ ధైర్యంతో ఈ నంబర్ వాడారో తెలియదుగానీ అదే ఇప్పుడు సమస్యగా మారింది. ద దర్శకుడు శ్రీరామ్ వేణు చిన్న లాజిక్ మిస్సయ్యాడు. పైగా ఈరోజు దర్శకుడు శ్రీరామ్ వేణు పుట్టినరోజు. సంతోషంగా గడిపాల్సిన ఆయనకు ఈ ఆరోపణ మనశ్శాంతిలేకుండా చేసింది. దీన్ని నిర్మాత సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటారేమో చూడాలి.