స్వతంత్ర భారతదేశంలో పోలీసులు ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు 1940 లో మహాత్మా గాంధీ సమాధానం ఇస్తూ పోలీసులు ప్రజలకు సేవకులు తప్ప యజమానులుకారు అన్నారు. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉండాలి కానీ అత్యంత అరుదుగా మాత్రమే ఉపయోగించాలి.
సామాజిక సంస్కర్తలుగా వారు విధులు నిర్వర్తించాలి అంటూ ఆదర్శ రాజ్యాన్ని మహాత్మాగాంధీ ఊహించారు.cకానీ ఇప్పుడు జరుగు తున్నది ఏమిటి?అధికార పక్షానికి రక్షకులుగా,ప్రజల,ప్రతిపక్ష భక్షకులుగా బిరుదులు అందుకొంటున్నారుపోలీసులు .ప్రభుత్వాలు వస్తూ పోతుంటాయి.పోలీసు వ్యవస్థ చట్ట ప్రకారం పని చెయ్యడంలో పోలీసుల పాత్రేమీ మారదు. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరే వేరుగా వుంది. చట్టాన్ని రక్షించడానికి అధికారం ఇస్తే పోలీసులు చట్టాన్ని తమచేతుల్లోకి తీసుకొని పాలక పక్షానికి ఊడిగం చేస్తున్నారు. న్యాయస్థానాలు సైతం వ్యవస్థీ కృత నేరగాళ్లుగా చివాట్లు పెడుతున్నా వారు అలంకరించుకొన్న అసమాన కీర్తి కిరీటాలను తొలగించుకోవడానికి పోలీసులు ఇష్టపడటం లేదు.మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని మీకు గుర్తుందా అని సాక్షాత్తు రాష్ట్ర న్యాయస్థానమే నిలదీచెంతంగా పోలీసులు పెట్రేగి పోతున్నారు.
ఐపిఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్- కానీ జగన్ అధికారంలోకి వచ్చాక వైసిపి పొలిటికల్ సర్వీస్ గా మారిపోయింది.రాజ్యాoగ నిర్మాతలు నిర్ధేశించిన కర్తవ్యాలను సంపూర్ణంగా నిర్వర్తించాల్సిన పోలీసులు జగన్ అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తిస్తున్నారు. శాంతి యుతంగా నిరసన తెలిపే ప్రజల,ప్రతిపక్షాల హక్కులను కర్కశంగా కాలరాస్తున్నారు. సభలకు,కార్యక్రమాల నిర్వహణకు అనుమతి ఇవ్వడంలో అధికార పార్టీని చంకన ఎక్కించుకొంటూ,ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు.అధికార పార్టీకి భేషరతుగా,ప్రతిపక్షానికి షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నారు.ఏపీలో ఏలిన వారి కను సైగలతో సాగుతున్న దుర్రాజకీయంతీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. స్వాతంత్రోద్యమాన్ని అణచి వెయ్యడానికి తీసుకొచ్చిన కఠినమైన పోలీసు చట్టాన్ని. స్వాతంత్ర్యానంతరం కూడా నాటి బ్రిటీష్ బానిస చట్టాన్నే అమలు చేస్తూ నేడు పోలీసులు పాలకులకు అనుగుణంగా వ్యవహరిస్తూ వారి స్వప్రయోజనాలకు పాటు పడుతూ భక్షక భటులుగా మారారు. అధికారపార్టీ నాయకులు ఎలా చెబితే అలా కేసులు నమోదు చేస్తూ పాలకులకు పాలేర్లుగా పనిచేస్తున్నారు పోలీసులు.
మానవ హక్కుల భక్షకులుగా మారి అధికార పార్టీ పట్ల అపారస్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు.ముఖ్యమంత్రికి నచ్చని వాళ్ళని అక్రమ అరెస్టులు చేసి చితక బాదడానికే పోలీసులకు లాఠీలు ఇచ్చినట్లుగా,అధికార పార్టీ నాయకుల పై ఈగ వాల కుండా కాపలా కాయడానికే ,ప్రతి పక్షణాన్ని అణచి వెయ్యడానికేపోలీసులు ఖాకీ బట్టలు వేసుకొన్నట్లు గావ్యవహరిస్తున్నారు?ఏపీని ఏక చ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్నజగన్ రెడ్డి తనను ప్రశ్నించిన,విమర్శించిన వారిపైకి ఖాకీలను ఉసిగొల్పికక్ష తీర్చుకోవంలో ఘన చరిత్ర సాధించారు.ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి కొందరు పోలీసులు కూడా ఇష్టాను సారం వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని అరాచకాలను పాల్పడినా వారిపై ఎలాంటి చర్యలూ వుండవు. ప్రతిపక్షాలు ఏ నిరసన కార్యక్రమం తలపెట్టినా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రతి పక్ష నాయకుడి ఇంటి పై దాడి చెయ్యడానికి వెళ్లిన వారిపై,తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడిచేసి ధ్వంసం చేసిన వారిపై ఇంత చర్యలు లేవు. ప్రజాస్వామ్యంలో ప్రతిపౌరుడికి ప్రభుత్వ విధానాలను,అవినీతిని,అక్రమాలను ప్రశ్నించే,నిరసన తెలిపే హక్కువున్నది.
అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కళ్ళుపీకినా, కుళ్ళబొడిచినా, కాళ్ళువిరిచి కత్తులతో పొడిచినా,శిరోమండలాలు చేసినా పట్టించుకొనే దిక్కులేదు.అధికార పార్టీనేతల ఆదేశాలతో నిందితులను బాధితులుగా, బాధితులను నిందితులుగా మారుస్తున్నారు.కొందరు పోలీసుల అరాచకం హద్దులు దాటింది. ఎస్సిల పైనే ఎస్సి, ఎస్టీ అట్రా సిటీ కేసులు పెడుతున్నారు. అధికారపార్టీ అరాచకాలను, దాష్టీకాలను చూస్తూ పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. మూడున్నరేళ్లుగా అధికారపార్టీనాయకుల విధ్వంసం, అరాచకం పై పోలీసులు కనీసం కన్నెత్తి కూడా చూడటంలేదు. వ్యక్తులు కైనా,వ్యవస్థలకైనా సుప్రీం కోర్టు మార్గదర్శకాలే శిరోధార్యం కావాలి.వ్యక్తులను పోలీస్ కస్టడీలో చిత్రహింసలు,అక్రమ అరెస్టులు,నిర్భాందాల పై 2014 ఆర్నేష్ కుమార్ వర్సెస్ బిహార్ కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. [1997]air1997sc610] పోలీసులకు11 నిర్ధిష్ట అవసరాలు,మరియు విధానాలు నిర్ధేశించింది. కానీ కొందరు పోలీసులు సుప్రీంకోర్టు మార్గ దర్శకాలకు వీసమెత్తు విలువ ఇవ్వకుండా పెడపోకడలతో వ్యవహరిస్తూ ,మహోన్నత సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉల్లంఘిస్తూ ధిక్కారంతో అధికారపార్టీ ఆడమన్నట్లు ఆడుతున్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు లో మంత్రి ప్రోద్భలంతో తెలుగుదేశం కార్యకర్తల పై ఉద్దేశ్యపూర్వకంగా హత్యాయత్నం,ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక సెక్షన్ల కింద కేసులు పెట్టి పోలీసులు వేధించడం అనాగరికం. మాచర్ల,కుప్పం,తంబళ్ళ పల్లె వంటి ప్రాంతాల్లోనూ పోలీసులు ఇదే పద్దతిలో వ్యవహరిస్తున్నారు. వైసిపి నాయకుల పై మాత్రం సాధారణ సెక్షన్ల కింద నామ మాత్రపు కేసులు పెడుతున్నారు.పుంగనూరులో తెలుగుదేశం కార్యకర్తల పై 10 రోజుల్లో అయిదు ఎఫ్ఐ ఆర్ రాయించి దాదాపు 80 మంది పై హత్యాయత్నం కేసులు పెట్టడం దారుణం.అనేక సందర్భాల్లో పోలీసులు యూనిఫాo,నేమ్ బ్యాడ్జ్ లు లేకుండా లేకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా నిందితులను అరెస్టులు చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా బాధ్యుల పై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం దారుణం.రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడం కోసమే తెలుగుదేశం మద్దతు దారుల పై ఈ అక్రమ కేసులని కోర్టులో మేజిస్ట్రేట్ భావించి రిమాండ్ ల తిరస్కరణ ద్వారా అర్ధం అవుతుంది.
అధికార పార్టీనాయకుల రాజకీయ కక్ష సాధింపులకు చర్యలకు మద్దతు ఇస్తూ వైసిపి రాజకీయ ప్రయోజనాలు కాపాడటమే పరమావధి అన్నట్లు వ్యవహరిస్తున్నారు పోలీసులు. ప్రతిపక్షానికి చెందిన వారిపై జరుగుతున్నదాడులకు,అరాచకానికి సంబంధించి ఏ అంశం పై అయినా పిర్యాదు,లేదా వినతి పత్రం ఇవ్వడానికి డిజిపి ఆఫీసుకు వెళితే గేటు బయటే నిలిపి వేసి అడ్డుకొంటున్నారు. అదేమిటని ప్రశ్నించిన బాధితుల పైనే కేసులు నమోదు చేస్తున్నారు.సామాజిక మాధ్యమాల్లో ప్రతిపక్ష కుటుంభ సభ్యులను,మహిళలను అసభ్యంగా దూషిస్తూ వీడియోలు,పోస్టులు పెడుతున్న వైసిపి నాయకులు,కార్యకర్తల పై ఎవరు ఎన్ని పిర్యాదులు చేసినా పట్టించుకోరు.అధికార పార్టీ నాయకుల మనసెరిగి మసలు కోవడంలో తమ భాధ్యతను కొందరు నిష్టగా నిర్వర్తిస్తున్నారు. ఏపీలో ఏలిన వారి కనుసన్నల్లో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం.
విధి నిర్వహణలో ఖాకీల నిష్పాక్షికత పూర్తిగా కనుమరుగయింది. విధి నిర్వహణలో పోలీసులు తాము నిర్వహిస్తున్న పాత్రపై ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. గతంలో పోలీస్ వ్యవస్థను ఏ ప్రభుత్వం ఇంత నీచంగా వాడుకున్న పరిస్థితి లేదు.శాంతి భద్రతల పరిరక్షణ,నేర నియంత్రణ,అరాచకం,విధ్వంసం,దాడులు వదిలేసి అధికార పార్టీనాయకుల రాజకీయ కక్ష సాధింపులకు చర్యలకు మద్దతు ఇస్తూ వైసిపి రాజకీయ ప్రయోజనాలు కాపాడటమే పరమావధి అన్నట్లు వ్యవహరిస్తున్నారు పోలీసులు. ఏది ఏమైనా ఐపిఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్- కానీ జగన్ అధికారంలోకి వచ్చాక వైసిపి పొలిటికల్ సర్వీస్ గా మారిపోయింది.రాజ్యాoగ నిర్మాతలు నిర్ధేశించిన కర్తవ్యాలను సంపూర్ణంగా నిర్వర్తించాల్సిన పోలీసులు జగన్ అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తిస్తూ.అధికార పక్షానికి రక్షకులుగా,ప్రజల,ప్రతిపక్ష భక్షకులుగా బిరుదులు అందుకొంటున్నారు పోలీసులు