January 20, 2021 9:36 AM
26 °c
Hyderabad
24 ° Wed
24 ° Thu
24 ° Fri
23 ° Sat
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

రజినీని ఎవరు శాసించారు? ఎందుకు పాటించారు?

సినిమాల్లో డైలాగులు చెప్పడానికీ జీవితంలో ఆచరించడానికీ చాలా తేడా ఉంటుందని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కి అర్థమైనట్టే ఉంది. రాజకీయాల విషయంలో ఎవరు శాసించారో తెలియదుగానీ ఆయన మాత్రం తూచా తప్పకుండా పాటించారు.

December 31, 2020 at 10:32 AM
superstar rajinikanth

superstar rajinikanth

Share on FacebookShare on TwitterShare on WhatsApp

సినిమాల్లో ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అనే డైలాగు పలికిన రజినీకాంత్ జనం ముందు వందల ప్రశ్నలను మిగిల్చారు.

రజినీ అంటే చీకటి అనే అర్థముంది.. సినిమాల్లో ఆయన కాంతులు వెదజల్లినా జీవితంలో మాత్రం ఆయన ఎవరికీ అర్థం కారు అని మరోసారి నిరూపించారు. తన రాజకీయ జీవితానికి ఆయన ఎండ్ కార్డు పడేయటం ఆయనకు ఎంత లాభకరమోగానీ ఆయన మీదే ఆశలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీకి మాత్రం పెద్ద నష్టమేననాలి. ముఖ్యంగా భాజపా దృష్టంతా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల మీదే ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై భాజపా దృష్టి పెట్టింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు బాగా దగ్గరైంది. ఇక మిగిలింది తమిళనాడు, నవ్యాంధ్ర ప్రదేశ్. అక్కడ పావులు కదపాలంటే ఎవరో ఒకరు స్టార్ డమ్ ఉన్న నటులు అవసరం.

ఏపీ విషయానికి వస్తే అంతో ఇంతో పవన్ కళ్యాణ్ భాజపాకు దగ్గరగానే ఉన్నారు. ఇక తమిళనాడులో భాజపా పాగా వేయడం అంత సులువైన విషయం కాదు. ప్రత్యక్షంగా అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయినా పరోక్షంగా పావులు కదుపుతూ వచ్చింది. అందులో భాగంగానే అన్నాడీఎంకే శశికళకు భాజపా అండదండలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. రజినీ రాజకీయ అరంగేట్రం వెనక భాజపా ఉందన్న ప్రచారం కూడా ఉంది. అంతా సజావుగా సాగితే రజినీ కాంత్ పార్టీ మక్కల్ సేవై కట్చీ ప్రకటన ఈరోజు వచ్చి ఉండేది. ప్రస్తుతానికి ఇక ఆ పార్టీ ప్రస్తావన లేనట్టే. రజినీ ఏ లెక్కలు వేసుకున్నారో తెలియదుగానీ మొత్తానికి ఆయన రాజకీయంగా వెనక్కి తగ్గారు.

ఆధ్యాత్మిక రాజకీయం ఏమిటో?

ఆధ్యాత్మిక రాజకీయం మన దేశానికి కొత్త కాదు. మతవాద పార్టీలన్నీ చేసిది ఆధ్యాత్మిక రాజకీయం కాక మరేమిటి? భాజపా కూడా ఆ అమ్ముల పొదిలోంచి వచ్చిందే. సెక్యులర్ పార్టీలకు దాదాపు కాలం చెల్లిపోయింది. కానీ తమిళనాడులో ఇంకా ఆ పరిస్థితి రాలేదు. అది మొదలు కావాలంటే రజినీ లాంటి బలమైన శక్తులు ఏమైనా రావాలి. ఒక దశలో ప్రధాని నరేంధ్ర మోడీ, అమిత్ షాలను కృష్ణార్జునులుగానూ రజినీ పోల్చారు. రజినీ ఇలా వెనక్కితగ్గడం భాజపాకు మింగుడు పడటం లేదు. తుగ్గక్ ఎడిటర్ గురుమూర్తి లాంటి వారు ఒక విధంగా రజినీని రాజకీయాల వైపు ప్రేరేపించారనవచ్చు.

2017లోనే రజినీని ఈ దిశగా ఆలోచింప జేశారాయన. డీఎంకే ఓట్లను చీల్చడమే భాజపా లక్ష్యంగా కనిపిస్తోంది. 2016లో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ ద్వారా కూడా ఇలాంటి ప్రణాళికతోనే ఓట్ల చీలికి రాజకీయం నడిచింది. అందులో భాగంగానే ఏఐడీఎంకే విజయం సాధించింది. కేవలం 1 శాతం ఓట్ల తేడాతోనే అన్నాడీఎంకే అధికారం లోకి వచ్చింది. ఈసారి కూడా డీఎంకే ఓట్లు చీలితే ఆ విధంగా ఏఐఏడీఎంకే లబ్ది పొందడమో, రజినీ ప్రభావం ఎక్కువగా ఉంటే అధికారం చేజిక్కించుకోవడమో వ్యూహంగా ఉంది. ఇంత పెద్ద వ్యూహానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది.

తమిళ రాజకీయాలకు హైదరాబాద్ వేదికైందా?

రాజకీయ పార్టీ మీద రజినీకాంత్ ఓ నిర్ణయానికి వచ్చాక తన సినిమా ‘అన్నాత్తే’ షూటింగును పూర్తిచేయడానికి రామోజీ ఫిలిం సిటీకి వచ్చారు. షూటింగ్ జరుగుతుండగా కొందరికి కోవిడ్ పాజిటివ్ రావడంతో షూటింగ్ నిలిచిపోయింది. ఈలోగా రజినీకాంత్ అనారోగ్యం వార్త వచ్చింది. ఈ గ్యాప్ లో రజినీ కాంత్ నిజంగానే అనారోగ్యం పాలయ్యారా అనే సందేహాలు కూడా జనంలో ఉన్నాయి. ఈ గ్యాప్ లో రజినీతో కొందరు భేటీ అయి లాభనష్టాలను బేరీజు వేశారని, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని రజినీకి బోధించారనే ప్రచారం కూడా జరుగుతోంది.

రామోజీ ఫిలింసిటీలో రజనీ ఎవరెవరిని కలిశారు? వారు ఇచ్చిన సలహాలు ఏమిటి ? అనేది కూడా చర్చనీయాంశమైంది. రజినీకి సన్నిహితంగా ఉండే చిరంజీవి, మోహన్ బాబు లాంటి వారు కూడా ఇప్పుడు రాజకీయాలు వద్దు అని రజినీకి సలహా ఇచ్చారని కూడా అంటున్నారు. ఆ ప్రకారం చూస్తే రజినీ అనారోగ్యం అనే దాన్ని సాకుగా చూపి అపోలోలో ఓ డ్రామా నడిపి కథను ఇలా ముగించారన్న ప్రచారం కూడా సాగుతోంది. రాజకీయాల విషయంలో రజినీ ఒక అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక్కి వేస్తున్నాడు. దాంతో కొన్ని శక్తులు రజినీని శాసించిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

దేవుడు శాసిస్తున్నాడు రజనీ పాటిస్తున్నాడు అనేలా వాతావరణం క్రియేట్ చేశారేమోనన్న అనుమానాలు ఉన్నాయి. త్వరలో జమిలీ ఎన్నికలు జరుగనుండగా ఇంత రిస్క్ ఇప్పుడు అవసరం లేదు అనే మాటకే రజినీ విలువనిచ్చారన్న అంశం కూడా ఉంది. రజినీ నిర్ణయం విషయంలో అనారోగ్యం కూడా ఆయనకు బాగా సహకరించింది. నరం లేని నాలుక ఎన్నయినా మాట్లాడుతుంది. కాస్త వయసులో రాజకీయాల్లోకి వస్తే బోలెడంత కెరీర్ వదులుకుని రాజకీయాలు అవసరమా అంటారు.. కాస్త వయసు మళ్లాక రాజకీయాల్లోకి వస్తే ఈ వయసులో ఈ రాజకీయాలు అవసరమా అంటారు. అసలు రాజకీయాలకు వయసుతో నిమిత్తం ఉందా అన్నది మరో ప్రశ్న.

తలైవాకి ఫిజికల్ గా ఫిట్ నెస్ లేదన్నది మాత్రం వాస్తవం. ఆయనకు ఇంచుమించు అదే వయసు వాడైన కమల్ మాత్రం మంచి ఫిట్ నెస్ తోనే ఉన్నారు. ఒకవిధంగా రజినీ రాజకీయాలను వాయిదా వేసుకోవడమే మంచిది. రజీనీది మొదట్నుంచీ నాన్చుడు ధోరణే. సినిమాల విషయంలోనూ అదే జరిగింది. రెండు మూడేళ్లు గ్యాప్ ఎందుకు అవసరమో అర్థం కాదు. ఎన్టీఆర్, ఎయన్నార్, కృష్ణ లాంటి నటులు వందల్లో సినిమాలు చేసినప్పుడు ఇంత క్రేజ్ ఉన్నా రజినీ చేసిన సినిమాలు బాగా తక్కువ.

ఇక వచ్చే ఏడాది జరిగే తమిళనాడు ఎన్నికల్లో రజినీ ఎవరికి మద్దతు అంశంపైనే ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. అంతో ఇంతో రాజకీయాల వైపు రజినీ మొగ్గు చూపాడు కాబట్టి రజనీ మద్దతు కోరే పార్టీలు కూడా ఈసారి ఎక్కువగానే ఉంటాయి. ఇక రజినీ స్థాపించిన మక్కల్ మండ్రమ్ ఏంచేస్తుందో కూడా చూడాలి. రాజకీయాలకు అతీతమైన ప్రజాసేవ వైపు ఈ రజినీ మక్కల్ మండ్రమ్ మొగ్గుచూపే అవకాశాలే ప్రస్తుతానికి ఎక్కువ.

– హేమసుందర్ పామర్తి

Tags: actor rajinikanthleotoppolitical entry rajinikanthPolitics of Tamil Super Star Rajinikanthrajinikanth health condition newsrajinikanth health condition stable nowrajinikanth not entering in politicsrajinikanth political entrysuperstar rajinikanthtamil nadu political newstamil politivstamil super star rajinikanthtelugu newswhy rajinikanth not entering politics
Previous Post

సీఎం సభలో అపశృతి : ఎండ తాళలేక వృద్ధుడు మృతి

Next Post

ఎటూ తేల్చని డిసిజిఐ.. 25 కి చేరిన కొత్త కరోనా కేసులు

Related Posts

Editors Pick

పశ్చిమ బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థి.. స్వామీజీనేనా?

by లియో డెస్క్
January 20, 2021 6:00 am

రానున్న ఏప్రిల్‌, మే నెలలో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 294...

Editors Pick

అర్నాబ్‌పై దేశ ద్రోహం కేసు పెడ్తారా..?

by లియో డెస్క్
January 19, 2021 6:12 pm

అర్నాబ్ గోస్వామి.. టీఆర్‌పీ రేటింగ్స్ ట్యాంపరింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న, జైలుకి వెళ్లి...

Editors Pick

తమిళనాట మోదీకి ‘చిన్నమ్మ’ పెద్దదెబ్బ.. ఏబీసీ న్యూస్-సీ ఓటర్ సర్వే  

by లియో డెస్క్
January 19, 2021 2:59 pm

తమిళనాడు, పుదుశ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ , కేరళలో వచ్చే ఏప్రిల్ ,...

Andhra Pradesh

వైసీపీలో కలవరం.. వెల్లంపల్లిపై గరం గరం

by లియో డెస్క్
January 19, 2021 6:30 am

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఒక్కో...

Andhra Pradesh

బెయిల్ రావట్లేదా.. రానివ్వడం లేదా..

by లియో రిపోర్టర్
January 18, 2021 11:38 am

హఫీజ్ పేట భూవివాదం నేపథ్యంలో..బోయిన్ పల్లిలో సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో...

Editors Pick

భారతీయ అమెరికన్లకు కీలక పదవులు.. వైట్ హౌస్‌లో మనవాళ్లే 17మంది

by లియో డెస్క్
January 17, 2021 7:43 pm

అమెరికా అధ్య‌క్షుడిగా ప్ర‌మాణం చేయ‌బోతున్న జో బైడెన్ టీంలో 20 మంది భారతీయ...

Editors Pick

పీఎం కేర్స్ ఫండ్ ‘ప్రైవేటు’దా.. వంద మంది మాజీ ఐఏఎస్‌ల లేఖ

by లియో డెస్క్
January 17, 2021 4:00 pm

కొవిడ్ సమయంలో పేదలను ఆదుకునే లక్ష్యంతో ఏర్పాటైన పీఎం కేర్స్ ఫండ్ నిధుల...

Andhra Pradesh

అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు.. బీజేపీ వైపు జేసీ చూపు?

by లియో డెస్క్
January 17, 2021 11:23 am

అనంతపురం జిల్లాలో టీడీపీ కీలక నేత జేసీ దివాకర్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుపై...

Editors Pick

రామా నీవే దిక్కు : మందిరం- రాజ్యమే నినాదాలు!

by లియో రిపోర్టర్
January 16, 2021 7:34 pm

తెలంగాణ బీజేపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్ళేందుకు మ‌రో నినాదం ఎంచుకుంది. ఇప్ప‌టికే పార్టీపై ప్ర‌జ‌ల్లో...

Editors Pick

అర్నాబ్ వివాదంలోకి పీఎంఓ, ప్రకాశ్ జవదేకర్

by లియో రిపోర్టర్
January 16, 2021 4:45 pm

టీఆర్ పీ రేటింగ్ స్కాంలో రిపబ్లిక్ టీవీ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

గుడివాడ టు టౌన్ ఎస్.ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య

మాటల యుద్ధం ముదిరి రోడ్డున పడింది!

రోజా ‘కన్నీటి’ కష్టాలకు.. ప్రాధాన్యం తగ్గటమే కారణమా?

దేవుడిని వేడుకోవాలి కాని వాడుకోకూడదు : డీఐజీ

వైసీపీలో కలవరం.. వెల్లంపల్లిపై గరం గరం

సీఎం హస్తిన టూర్ సంజాయిషీ ఇచ్చుకునేందుకేనా?

ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్‌గా నరేంద్రమోడీ

రామతీర్థంలో అంతా రహస్యం.. ఎందుకో ?

ఎన్టీఆర్ మరణానికి కారణం యనమల రామకృష్ణుడా?

భారత్‌ సంచలనం… ఆసీస్ పై చరిత్రాత్మక విజయం

ముఖ్య కథనాలు

గోపీచంద్ కి మెగాభినందనలు… !

వారెవ్వా.. చిన్న నిర్ణయం.. పెద్ద సంకేతం!

‘స్థానికం’పై ఉద్యోగుల‌ ఇంప్లీడ్ డిస్మిస్‌.. జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దా?

జగన్ నిర్ణయానికి కేసీఆర్ చెక్!

పవన్ మూవీలో అనసూయ? ఈసారైనా ఓకే చెబుతుందా.?

ట్రైలర్ టాక్ : గోల్డ్ లోన్స్ గోల్ మాల్ స్టోరీ ‘బంగారు బుల్లోడు’

వేసవిలో సాగునీరు.. కేసీఆర్ ఆదేశాలు!

తన ప్రేమకథను బయటపెట్టిన మోనాల్

కొవిడ్ వేక్సిన్ ముసుగులో నిధులు దండుతున్న ‘సీరమ్’

ప్రేమ, పెళ్లీ అయ్యాయి.. ఈలోగా నరికేశాడు

సంపాదకుని ఎంపిక

కరోనా రెండో దశలో విజృంభిస్తుందా?

నిధులు మొత్తం కరిగిపోయాయ్ : కార్పొరేషన్ అభ్యర్థులు దివాలా….!

మంత్రులకు మార్కులు ఇస్తున్న ఏపీ సీఎం జగన్

నా వల్ల కాదు : చేతులెత్తేసిన పవన్ నిర్మాత!

కరణంపై కస్సుబుస్సుతో హీట్ పెంచిన ఆమంచి

ధిక్కారస్వరమే రాజన్నను దెబ్బతీసిందా.. ?

కాడిని వదిలేస్తున్న అగ్రనేతలు

అంబేద్కర్ మీద పాలుపోస్తే దళితప్రేమ అవుతుందా?

రెండు ముక్కలైతే దక్కేదెంత? పోయేదెంత?

జీఎస్టీ చెల్లించేందుకు కేంద్రానికి గతి లేదా?

రాజకీయం

పశ్చిమ బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థి.. స్వామీజీనేనా?

కేంద్ర పథకాలు, టీఆర్‌ఎస్ వైఫల్యాలు.. గడప గడపకు బీజేపీ

‘స్థానికం’పై ఉద్యోగుల‌ ఇంప్లీడ్ డిస్మిస్‌.. జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దా?

జగన్ నిర్ణయానికి కేసీఆర్ చెక్!

అర్నాబ్‌పై దేశ ద్రోహం కేసు పెడ్తారా..?

వేసవిలో సాగునీరు.. కేసీఆర్ ఆదేశాలు!

రామతీర్థంలో అంతా రహస్యం.. ఎందుకో ?

టీపీసీసీ రాజ్‌భవన్ ముట్టడి.. ఉద్రిక్తత

తమిళనాట మోదీకి ‘చిన్నమ్మ’ పెద్దదెబ్బ.. ఏబీసీ న్యూస్-సీ ఓటర్ సర్వే  

రోజా ‘కన్నీటి’ కష్టాలకు.. ప్రాధాన్యం తగ్గటమే కారణమా?

సినిమా

సినిమా తీసి నష్టపోయానంటున్న యంగ్ హీరో  

గోపీచంద్ కి మెగాభినందనలు… !

పవన్ మూవీలో అనసూయ? ఈసారైనా ఓకే చెబుతుందా.?

ట్రైలర్ టాక్ : గోల్డ్ లోన్స్ గోల్ మాల్ స్టోరీ ‘బంగారు బుల్లోడు’

తన ప్రేమకథను బయటపెట్టిన మోనాల్

పల్లెటూరి బుల్లోడుగా సూర్య 

క్లైమాక్స్ చిత్రీకరణలో రాజమౌళి ట్రిపుల్ ఆర్

బాలయ్య.. ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పేశారా.?

నిన్న స్టైలిష్ స్టార్ – నేడు  మెగాస్టార్, మెగా పవర్ స్టార్

పూరి అసలు ప్లాన్ ఇదే .. !

మెగా ప్రిన్స్ .. హ్యాపీ బర్త్ డే

జనరల్

‘స్థానికం’పై ఉద్యోగుల‌ ఇంప్లీడ్ డిస్మిస్‌.. జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దా?

అర్నాబ్‌పై దేశ ద్రోహం కేసు పెడ్తారా..?

వేసవిలో సాగునీరు.. కేసీఆర్ ఆదేశాలు!

కొవిడ్ వేక్సిన్ ముసుగులో నిధులు దండుతున్న ‘సీరమ్’

ప్రేమ, పెళ్లీ అయ్యాయి.. ఈలోగా నరికేశాడు

రామతీర్థంలో అంతా రహస్యం.. ఎందుకో ?

బాలయ్య.. ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పేశారా.?

దేవుడిని వేడుకోవాలి కాని వాడుకోకూడదు : డీఐజీ

చైనాకు ఉడాయించిన లోన్ యాప్స్ కంపెనీల డైరక్టర్లు

గుడివాడ టు టౌన్ ఎస్.ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist