వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి నేతృత్వంలో నడుస్తున్న సా*క్షి టీవీలో వార్తలన్నీ… ఆ పార్టీకి అనుకూలంగానే ఉంటున్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా… తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే జగన్ చైర్మన్ గా ప్రస్థానం మొదలెట్టిన సాక్షి టీవీ గానీ, సా*క్షి దినపత్రిక గానీ… ఆది నుంచి వైఎస్ కుటుంబం… ప్రత్యేకించి జగన్ వ్యతిరేకులను టార్గెట్ చేస్తూ అసత్య కథనాలు రాయడమే పనిగా పెట్టుకున్న సంస్థలుగా జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నాయి. అంతేకాకుండా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పలువురు పారిశ్రామికవేత్తలను బెదిరించి మరీ పెట్టుబడులు పెట్టించిన జగన్ సా*క్షిని మొదలుపెట్టిన తీరుపైనా విమర్వల జడివాన కురుస్తూనే ఉంది. ఈ కారణంగానేకాబోలు సా*క్షి పత్రికను అవినీతికి పుట్టిన పుత్రిక అంటూ వైరి వర్గాలు ఆ మీడయా సంస్థలను అవహేళన చేస్తూ ఉంటాయి.
ఎలాగూ జగన్ వర్గానికి అనుకూలంగా వార్తలు రాసే పత్రికగా ముద్రపడిన సాక్షికి అటు సర్క్యులేషన్ పరంగా, ఇటు వ్యూయర్ షిప్ పరంగా ఎప్పుడూ సానుకూల ఫలితాలైతే రాలేదు. సదే… మెడలో జనం ఓ బోర్డేశారు కదా.. ఆ బోర్డుకైనా న్యాయం చేద్దామనుకున్నారో, ఏమో తెలియదు గానీ… సా*క్షిలో ఇప్పుడు వస్తున్న వార్తలు, ప్రసారం అవుతున్న న్యూస్ బులెటిన్లు, స్పెషల్ స్టోరీలు… అన్నీ అయితే జగన్ నామస్మరణలో సాగాలి, లేదంటే… టీడీపీని, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, టీడీపీ నేతలు, వారి కుటుంబాలపై విషం చల్లడమే పరమావధిగా సాగుతున్నాయి. ఇందులో సా*క్షి టీవీలో పిల్లిగడ్డం వేసుకుని కనిపించే జర్నలిస్ట్ ఈశ్వర్ స్టోరీలు అయితే మరింత ఘోరంగా ఉంటున్నాయి. రాజకీయ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఈశ్వర్ కొనసాగించే స్టోరీలను జనం ఈసడించుకున్న వైనం ప్రత్యేకంతగా చెప్పాల్సిన పని లేదు.
ఈశ్వర్ స్టోరీలే కంపు అనుకుంటే… ఇప్పుడు కొత్తగా వైసీపీ నేతగా ఎప్పుడో అవతారం ఎత్తిన ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి సా*క్షి టీవీలో కనిపించనున్నారు. ఈ మేరకు ఆదివారం సా*క్షి టీవీ ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో ఓ చైర్ వద్దకు వస్తున్న పోసాని… అందులో కూర్చోవడానికి బదులుగా దాని వెనకాలకెళ్లి నిలబడతారు. ఈ కార్యక్రమం పేరేమిటి? అందులో ఎలాంటి కథనాలను ప్రసారం చేస్తారన్న వివరాలేమీ లేకున్నా… పోసాని స్టైల్ ను చూస్తుంటే… జగన్ తరఫున ఆయన వైరి వర్గాలను చీల్చి చెండాడేందుకే వస్తున్నారని చెప్పొచ్చు. వైసీపీ నేతగా మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి… పోసాని తనదైన మేనరిజంతో జర్నలిస్టుల ఓపికకే పరీక్ష పెట్టేలా వ్యహరిస్తూ ఉంటారు. ఇక సా*క్షి టీవీలో ప్రోగ్రాం అంటే… అసలు ఆయనను ప్రశ్నలు అడిగే వారే ఉండరు కదా. అంటే… ఆ షోలో పోసానిది ఇష్టారాజ్యమేనని చెప్పక తప్పదు. అదుపులో ఉంటేనే చేయి కాలిన పిల్లిలా షర్చును సర్దేసుకుంటూ కనిపించే పోసాని… ఇక అదుపు అన్నదే లేని టీవీ షోలో ఇంకేమాత్రం రచ్చ చేస్తారోనని, సాక్షి టీవీలో ఆ షోను ఇంకెంత కంపు పట్టిస్తారోనన్న సెటైర్లు పడిపోతున్నాయి.