అల్లు అర్జున్ కి కాస్త ముందుచూపు ఎక్కువే. అది లేకపోతే ఆయన ఇంతదూరం వచ్చేవాడు కాదనుకోండి .. అది వేరే విషయం. ప్రస్తుతం అల్లు అర్జున్ .. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. బన్నీ లుక్ .. సిస్టర్ సెంటిమెంట్ .. గిరిజన యువతి పాత్రలో రష్మిక అనే అంశాలు ఈ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా అడవి నేపథ్యంలో జరిగే పోరాట సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు.
సుకుమార్ తో బన్నీ చేస్తున్నది పాన్ ఇండియా సినిమానే. అందువలన అందుకు తగినట్టుగానే ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళుతున్నారు. బన్నీ ఆ తరువాత సినిమాను కొరటాలతో చేయనున్నట్టు ప్రకటన కూడా వచ్చేసింది. గీతా ఆర్ట్స్ 2 .. యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే అనే ప్రచారం బలంగానే జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని అంటున్నారు.ఈ సినిమాలో కథానాయిక కోసం ప్రియాంక అరుళ్ మోహన్ – కృతిశెట్టి పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం కొరటాల శివ, చిరంజీవి కథానాయకుడిగా ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. ఇక బన్నీ చేస్తున్న ‘పుష్ప’ సినిమా కూడా చాలావరకూ షూటింగు జరుపుకుంది. ఆ తరువాత కొరటాల – బన్నీ కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. వచ్చే వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా బన్నీ లైన్లో పెట్టే పనిలో ఉన్నాడనీ, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీ చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.











