సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే… దీనికి సైమల్ టేనియస్ గా … మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపించారు. త్రివిక్రమ్ మహేష్ కి కథ చెప్పడం జరిగింది. ఈ కథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాకపోతే ఈ మూవీని వెంటనే కాకుండా… సర్కారు వారి పాట కంప్లీట్ అయిన తర్వాతే చేస్తానన్నారు.
ఈవిధంగా త్రివిక్రమ్ ని లాక్ చేసారు మహేష్. ఇదిలా ఉంటే… సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత కథ రెడీ చేయ్ మళ్లీ మనం కలిసి సినిమా చేద్దామని అనిల్ రావిపూడికి మహేష్ కి ఆఫర్ ఇచ్చారు. కరోనా టైమ్ లో అనిల్ రావిపూడి మహేష్ కోసం మాంచి స్టోరీ రెడీ చేసారట. మహేష్ రెడీ అంటే అనిల్ రావిపూడి రెడీ అంటూ సినిమా చేసేయడానికి సిద్దంగా ఉన్నారు. ఈ విధంగా అనిల్ రావిపూడి కూడా మహేష్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ఎప్పటి నుంచో మహేష్ తో సినిమా చేయాలని రాజమౌళి, పూరి జగన్నాథ్ అనుకుంటున్నారు.
ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ కూడా మహేష్ కోసం వెయిటింగ్. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సుకుమార్. అసలు రంగస్థలం తర్వాత మహేష్ తోనే సినిమా చేయాలి అనుకున్నారు సుకుమార్ కానీ… కొన్ని అనుకోని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో సుకుమార్… అల్లు అర్జున్ తో పుష్ప సినిమా స్టార్ట్ చేసారు. అయితే… మహేష్ తో సుకుమార్ 1 నేనొక్కడినే అనే సినిమా చేసారు. ఆ సినమా ఫ్లాప్ అయినా… సుకుమార్ టాలెంట్ మీద మహేష్ కి బాగా నమ్మకం. ఆయనంటే గౌరవం. అందుకనే సుకుమార్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట మహేష్.
లాక్ డౌన్ టైమ్ లో సుకుమార్ మహేష్ కోసం కథ రెడీ చేసారట. ఇటీవల ఈ కథను మహేష్ కి చెబితే.. తప్పకుండా మనం సినిమా చేద్దామని ఓకే చెప్పారట. సుకుమార్ పుష్ప తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా చేస్తారు. ఆతర్వాత మహేష్ తో మూవీనేనట. ఏది ఏమైనా… ఒక సినిమా తర్వాత మరో సినిమా చేసే మహేష్ పక్కా ప్లాన్ తో దర్శకులను బాగానే లాక్ చేస్తున్నాడు.
Also Read: సితార క్లాప్ తో మహేష్ ‘సర్కారు వారి పాట’ ప్రారంభం











