Producer RR Venkat Passed Away :
ఆర్. ఆర్. మూవీ మేకర్స్ అధినేత వెంకట్ మరణం చిత్ర పరిశ్రమకు పెద్ద లోటుగానే చెప్పాలి. ఎందుకంటే ఆయన చిత్ర పరిశ్రమలో నిర్మాతగా అడుగుపెట్టి తక్కువ కాలంలో వరుసగా సినిమాలు చేశారు. ది ఎండ్, సామాన్యుడు, మాయాజాలం, హంగామా, గుండమ్మగారి మనవడు, బహుమతి, కిక్, ప్రేమకావాలి, డాన్ శీను, పైసా, ఢమరుకం, బిజినెస్ మాన్, లవ్లీ, విక్టరీ లాంటి సినిమాలు తీశారు. ఇంగ్లీషులో డివోర్స్ ఇన్విటేషన్ అనే సినిమా తీశారు. మరో నిర్మాత కె. అచ్చిరెడ్డి లాంటి వారి సహకారం తీసుకుని ఆయన ఆధ్వర్యంలో కూడా కొన్ని సినిమాలు తీశారు.
చాలా తక్కువ కాలంతో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పెద్ద నిర్మాణ సంస్థగా మారింది. స్టార్ హీరోలు సైతం ఆర్ ఆర్ మూవీ మేకర్స్ తో సినిమాలు తీసే స్థాయికి వెంకట్ ఎదిగారు. ఆయన అసలు పేరు జేవీ వెంకట్ ఫణీంద్ర రెడ్డి. చిత్ర పరిశ్రమలో మాత్రం వెంకట్ అంటుంటారు. ఆయన గత కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు.
ముఖ్యంగా ఆయన సినిమా రంగంలో తెరవెనుక పాత్రనే పోషించేవారు. సేవా సంస్థలకు విరాళాలు ఇవ్వడంలోనూ ముందుండేవారు. గత కొంతకాలంగా ఆయన చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు. మంచి నిర్మాతగా పేరు తెచ్చుకోవడంతో అటు నటీనటుల్లోనూ, టెక్నీషియన్లలోనూ ఆయనకు మంచి పేరుంది. అందుకే ఆయన మరణించారని తెలిసి ప్రముఖులంతా ట్విట్టర్ ద్వారా తమ సంతాపాలను ప్రకటిస్తున్నారు.
Must Read ;- ఈశ్వర్ చేతిలో కొత్త పుంతలు తొక్కిన సినిమా పోస్టర్











