మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడని.. అది మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ అని తెలిసినప్పుడు అందరిలాగే వరుణ్ తేజ్ కూడా మాస్ మూవీతో ఎంట్రీ ఇస్తాడు అనుకున్నారు కానీ.. రొటీన్ కి భిన్నంగా గ్రామాల్లో ఉండే రాజకీయం కథావస్తువుగా రూపొందిన ముకుందా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. విజయం సాధించి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. మెగా ఇమేజ్ కి భిన్నంగా వరుణ్ తేజ్ ఎంచుకున్న ఈ వైవిధ్యమైన కథ వరుణ్ ఆలోచనా విధానాన్ని తెలియచేసింది.
‘ముకుంద’ సినిమా తర్వాత వరుణ్ తేజ్ చేసిన మరో విభిన్న కథా చిత్రం కంచె. క్రిష్ డైరెక్షన్ లో రూపొందిన కంచె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా విజయాన్ని కూడా అందించింది. ఇలా వరుసగా రెండు విభిన్న కథా చిత్రాలతో సక్సస్ సాధించి ప్రేక్షకాభిమానులతో శభాష్ అనిపించుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత వరుణ్ తేజ్.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్’ సినిమా చేశాడు.
వరుణ్ తేజ్ లో ఉన్న మాస్ యాంగిల్ ని పరిచయం చేసిన సినిమా ఇది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సస్ సాధించకపోయినా.. నటుడుగా వరుణ్ కి మంచి పేరు తీసుకువచ్చింది. అంతే కాకుండా.. మాంచి మాస్ స్టోరీ ఒకటి పడితే వరుణ్ తేజ్ మాస్ ని సైతం మెప్పించగలడు అనిపించేలా చేసింది. ఆతర్వాత మిస్టర్ అనే సినిమా చేశాడు కానీ.. వర్కవుట్ కాలేదు. ఈసారి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ సినిమా చేశాడు.
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ లవ్ స్టోరీ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డు కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. డిఫరెంట్ రూట్ లో వెళుతూ సక్సస్ సాధిస్తున్న వరుణ్ తేజ్ కెరీర్ లో మరచిపోలేని మరో సినిమా తొలిప్రేమ. పవర్ స్టార్ కెరీర్ లో మరచిపోలేని సినిమా టైటిల్ తో వచ్చిన తొలిప్రేమ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
వరుణ్ ని యూత్ కి మరింతగా దగ్గర చేసింది. ‘తొలిప్రేమ’ తర్వాత ‘అంతరిక్షం’ అనే విభిన్న కథా చిత్రం చేశాడు. ఇది ఒక ప్రయోగమే. కమర్షియల్ గా మెప్పించలేకపోయినా.. మంచి పేరును తీసుకువచ్చింది. ఆతర్వాత వరుణ్ తేజ్ చేసిన ‘ఎఫ్ 2, గద్దలకొండ గణేష్..’ చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచి వరుణ్ తేజ్ ఇమేజ్ ను అమాంతం పెంచేశాయి. ‘గద్దలకొండ గణేష్’.. మాస్ లో వరుణ్ తేజ్ కి మాంచి ఇమేజ్ తీసుకువచ్చింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘గని, ఎఫ్ 3’ సినిమాలు చేస్తున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో.. దూసుకెళుతున్న మెగా హీరో వరుణ్ తేజ్.. పుట్టినరోజు ఈరోజు. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే అండ్ ఆల్ ది బెస్ట్ టు వరుణ్ తేజ్…
Must Read ;- పవన్ కళ్యాణ్ పాత్ర ‘గని’ పేరుతో వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్











