బాలీవుడ్ అందగత్తెల జాబితాలో కియారా అద్వాని ముందువరుసలో కనిపిస్తుంది. అంతేకాదు బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ గా .. భారీ పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా అక్కడ ఆమె పేరే వినిపిస్తోంది. అలాంటి కియారా అద్వానిని తన సినిమా కోసం హరీశ్ శంకర్ సంప్రదిస్తున్నట్టుగా ఒక వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. ఇంతకుముందు కియారా అద్వాని తెలుగులో మహేశ్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ .. చరణ్ జోడీగా ‘వినయ విధేయ రామ’ సినిమాలు చేసింది. ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా .. మరొకటి భారీ ఫ్లాప్ ను చవిచూసింది.
పవన్ ను అభిమానించే దర్శకులలో హరీశ్ శంకర్ ఒకరు. గతంలో ‘గబ్బర్ సింగ్’ సినిమాతో పవన్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాను అందించిన ఘనత హరీశ్ శంకర్ ఖాతాలో ఉంది. ఆ వెంటనే పవన్ తో మరో సినిమా చేయడానికి హరీశ్ శంకర్ ప్రయత్నించాడు గానీ కుదరలేదు. పవన్ రాజకీయాల్లోకి వెళ్లే సరికి మరింత గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ లో హరీశ్ శంకర్ మాత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ .. ‘దువ్వాడ జగన్నాథం’ .. ‘గద్దలకొండ గణేశ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుని మాంచి జోరుమీద ఉన్నాడు.
పవన్ రీ ఎంట్రీ ఇచ్చేసరికి ఆయన కోసం హరీశ్ శంకర్ ఒక మాస్ మసాలా కథను రెడీ చేసుకున్నాడు. సమయం చూసి పవన్ కి ఆ కథను వినిపించాడు. తన అభిమానులు తన నుంచి ఆశించే అన్ని అంశాలు ఆ కథలో పుష్కలంగా ఉండటంతో వెంటనే పవన్ ఓకే చెప్పేశాడు. హరీశ్ వరుస హిట్లతో ఉండటం కూడా పవన్ అంగీకరించడానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా కియారా అద్వాని అయితే బాగుటుందని భావించిన హరీశ్, ఆమెను తీసుకునేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నాడు. మరి కియారా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో .. రెడ్ సిగ్నల్ వేస్తుందో చూడాలి.
Also Read: రజనీకాంత్ గారు త్వరగా కోలుకోవాలి ; పవన్ కళ్యాణ్