నరసాపురం ఎంపీ రఘురామరాజు ఏపీ సీఐడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. సోమవారం సుప్రీంకోర్టులో రాజు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. అయితే వైద్య పరీక్షల నిమిత్తం రఘురామను సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు అమలు చేయాలని ఏపీ సీఎస్‌ను ఆదేశించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో ఉన్న రాఘరామను సాయంత్రంలోపు సికింద్రాబాద్ కు తరలించే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా వైద్య పరీక్షల పర్యవేక్షణకు తెలంగాణ హైకోర్టు జ్యుడిషియల్ అధికారిని నియమించాలని సూచించింది. వై కేటగిరిలోనే రాఘురామ ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ వినీత్ సరన్, జస్టిస్ బి. ఆర్. గవాయితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను ధర్మాసనం మే 21కి వాయిదా వేసింది.
Must Read ;- ఈ రోజు రాత్రి నా భర్తను చంపేందుకు కుట్ర : రఘురామరాజు భార్య సంచలన కామెంట్స్











