వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సర్కారుపై చేసిన వ్యాఖ్యల విషయంలో రాజద్రోహం, ప్రభుత్వ కూల్సివేత కుట్ర లాంటి ఆరోపణలతో అరెస్టైన నర్సాపురం వైసీపీ ఎంపీ ఎంపీ రఘురామసకృష్ణరాజు కేసు విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన తండ్రి ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో పోలీసులు ఎలా ప్రవర్తించారనే అంశంపై ఆయన కుమారుడు కనుమూరు భరత్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు.ఎంపీ రఘురామకృష్ణరాజు హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ఏపీ సీఐడీ చీఫ్ పీవీ ప్రవీణ్ కుమార్ నాయక్ సారథ్యంలోని పోలీసులు నిర్ధాక్షిణ్యంగా, అమర్యాదకరంగా,నిబంధనలకు విరుద్ధంగా,హక్కులకు భంగం కలిగించేలా వ్యవవహరించారని పేర్కొన్నారు.కనీస నిబంధనలూ పాటించలేదన్నారు.మే 14న అరెస్టు చేయడంతోపాటు తన తండ్రి పట్ల అమానుషంగా ప్రవర్తించారని, ఒంటిపై గాయాలున్నాయని,తన తండ్రి నడవలేని విధంగా కొట్టారని ఫిర్యాదు చేశారు.తాము ఇప్పటికే న్యాయపోరాటం చేస్తున్నామని,గుంటూరు అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట తమ వాదన విపించామన్నారు.ఈ పరిణామాలు చూస్తుంటే తన తండ్రిపై కుట్ర జరుగుతోందనే అనుమానం వస్తోందని,హత్యాయత్నానికి పాల్పడ్డారని భావిస్తున్నామన్నారు.ఎంపీగా ఉన్న తన తండ్రి విషయంలో పోలీసులు ఇంత అమర్యాదపూర్వకంగా ప్రవర్తించిన వ్యవహారంపై ఇప్పటికే కోర్టుకు తెలిపామని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యంలో బతికే హక్కును కూడా హరించి వేస్తున్నారు..
ఏపీ పోలీసులు తన తండ్రి విషయంలో చట్టాన్ని, రాజ్యాంగాన్ని,న్యాయవ్యవస్థలతోపాటు ప్రజాస్వామ్యంలో బతికే హక్కును కూడా హరించి వేస్తున్నారని వ్యాఖ్యానించారు.ఈ విషయంలో తమ న్యాయవాదులు సుప్రీంకోర్టు,హైకోర్టుల ద్వారా కూడా పోరాడుతున్నారని చెబుతూ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు పౌరులకు న్యాయం ప్రసాదించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.ఈ లేఖతోపాటు ఎఫ్ఐఆర్ కాపీ,తన తండ్రి కాలి గాయాలకు సంబంధించిన ఫొటో,కోర్టు కాపీ ఆఫ్ ఆర్డర్ జత చేశారు.
నిగ్గు తేల్చేందుకు మెడికల్ బోర్డు ఏర్పాటు..
తనను సీఐడీ పోలీసులు కొట్టారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోర్టులో చెప్పడంతో ఈ అంశంపై స్పందించిన కోర్టు నిజాలు నిగ్గు తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది.హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవ్వడంతో సీఐడీ పోలీసులు రఘురామకృష్ణంరాజును శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుంటూరు సీఐడీ కోర్టులో హాజరు పర్చిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా తనను పోలీసులు కొట్టారని రఘురామకృష్ణంరాజు చెప్పడంతోపాటు ఆయన లాయర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు.పార్లమెంట్ సభ్యుడినే కొడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్నారు.హైకోర్టు ఆయన గాయాలను పరిశీలించాలని కోరారు.దీనిపై స్పందించిన హైకోర్టు ముగ్గురు వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు ఏర్పాటు చేసింది.గుంటూరు GGH సూపరింటెండెంట్ తోపాటు ముగ్గురు వైద్యులను నియమించింది.సీఐడీ పోలీసులు వెంటనే రఘురామకృష్ణంరాజును మెడికల్ బోర్డు ఎదుట హాజరుపర్చడంతోపాటు గాయాల పరిశీలన ప్రక్రియను మొత్తం వీడియోగ్రఫీ చేయాలని మెడికల్ బోర్డును ఆదేశించింది.అంతకుముందు సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు చేస్తున్న ఆరోపణలు అసత్యాలని,బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఆ గాయాలు తాజావని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.తదుపరి విచారణను ఆదివారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
Must Read ;- RRR కేసు: ముగిసిన వాదనలు.. వైద్య పరీక్షల పరిశీలన తరవాత తుది తీర్పు