తాజాగా జగన్ సర్కార్‌పై ఎంపీ రఘురామ రాజు సతీమణి రమాదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలీసులు తన భర్తను బాగా కొట్టారని ఆరోపించారు. కోర్టు నిబంధనలను పట్టించుకోకుండా జైలుకు తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే తన భర్తపై కుట్ర జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రఘురామరాజు విషయంలో ఏం జరుగుతుందో తనకేం అర్థం కావడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే.. అక్రమ అరెస్టులు చేస్తారా.. అని మండిపడ్డారు. తన భర్తను చంపేందుకు ఈ రోజు రాత్రి కుట్ర జరుగుతోందని, కడప నుంచి కొందరు జైలుకు వచ్చారని రఘురామరాజు భార్య సంచలన కామెంట్స్ చేశారు.
Must Read ;- నా తండ్రిని పోలీసులు కొట్టారు.. కేంద్ర హోంశాఖకు RRR కుమారుడు భరత్ లేఖ











