వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు, ఏపీ సీఎం జగన్ పై లేఖల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు ముఖ్యమైన హామీలపై లేఖలు రాసి… జగన్ ను నిలదీసే ప్రయత్నం చేశారు. తాజాగా రఘురామ ‘ప్రభుత్వ కర్తవ్యాల’ పేరుతో జగన్‌కు మరో లేఖ రాశారు. పోలీస్ కంప్లైంట్ అథారిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం దానికి చైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ, ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడాన్ని రఘురామ రాజు తప్పు పట్టారు. పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ నియామకం గురించి లేఖలో ప్రస్తావించారు. రిటైర్డ్ జడ్జి కనగరాజ్‌ను పీసీఏ చైర్మన్‌గా నియమించడంపై సరికాదని తెలిపారు. నిబంధనల ప్రకారం 65 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు మాత్రమే.. పీసీఏ చైర్మన్ పదవికి అర్హులని తెలిపారు. కనగరాజ్‌ను నియమించడం సరికాదని లేఖలో డిమాండ్ చేశారు.
గౌరవమైన నిర్ణయం తీసుకోండి
ప్రజల్లో మీ ఇమేజ్ పలుచన కాకూడదనే.. అందుకే లేఖలు రాస్తున్నానని స్పష్టం చేశారు. తనలాంటివాళ్లు ఇలాంటి మంచి అభిప్రాయాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఏపీలో పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ విషయంలో జగన్ మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. సీఎం జగన్ గౌరవప్రదమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు. ఇప్పటికే ఎన్నో సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్ సర్కార్ కు వరుసగా షాక్ లు ఇస్తున్నారు ఈ రెబల్ ఎంపీ. రఘు రామరాజు లేఖల మీద లేఖలు రాస్తుండటంతో వైసీసీ వర్గాల్లో తీవ్ర టెన్షన్ నెలకొంది.
Must Read ;- జగన్ కూడా పీకే మాదిరి సింహమేనంట!











