ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డను తొలగించి, ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజును నియమించాలని భావించించింది ఏపీ ప్రభుత్వం. అయితే నిమ్మగడ్డ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఆ పదవి నుంచి కనగరాజ్ తప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా జగన్ ప్రభుత్వం కనగరాజ్కు మళ్లీ కీలకపోస్టును కట్టబెట్టేందుకు యోచిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ‘పోలీస్ కంప్లైంట్ అథారిటీ’ (పీసీఏ)ను ఏర్పాటు చేసి, చీఫ్ గా జస్టిస్ కనగరాజును నియమించేందుకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు.. రాష్ట్రాలు పీసీఏని ఏర్పాటు చేయాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది జనవరిలో పీసీఏను ఏర్పాటు చేసింది. జగన్ ప్రభుత్వం కూడా పీసీఏ ఏర్పాటుచేసి, దానికి చీఫ్ గా కనగరాజ్ ను నియమించనుంది.
Must Read ;- రెండేళ్లలో ఒరిగిందేమిటీ..? : జగన్ కు మావోయిస్టుల లేఖ











