అదేదో సినిమాలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నోట వెంట వెలువడిన *నేను సింహం లాంటోన్నబ్బా. అది గడ్డం గీసుకోలేదు. నేను గీసుకోగలను. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టూ సేమ్* డైలాగ్ జనాలకు ఏ మేర ఎక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి డైలాగ్ ను ఇప్పుడు వైసీపీ నేతలు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా అతికించేశారు. *జగన్ సింహం లాంటోడే… దానికి దయా గుణం ఉండదు. జగన్ కు ఉంటుంది. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టూ సేమ్*.. అంటూ పవర్ ఫుల్ పంచ్ లు విసురుతూ తమలోని స్వామి భక్తిని చాటుకుంటున్నారు.
టీడీపీని వీడి వైసీపీకి జైకొట్టి…
అయినా ఈ కామెంట్ చేసిన వైసీపీ నేత ఎవరంటే… మొన్నటి సార్వత్రిక ఎన్నికల దాకా టీడీపీలో ఉండి, ఆ పార్టీ టికెట్ పై ఎంపీగా గెలిచి… సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీకి వెన్నుపోటు పొడిచి వైసీపీలోకి జంప్ కొట్టి… ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి… జగన్ కేబినెట్ లో ఏకంగా మంత్రి పదవిని దక్కించుకున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ ఈ ఆసక్తికర కామెంట్ చేశారు. నిత్యం జగన్ ను కీర్తించడమే పనిగా పెట్టుకున్న అవంతి… సమయం చిక్కినప్పుడల్లా జగన్ ను ఆకాశానికెత్తేస్తున్న వైనం అందరికీ తెలిసిందే.
పరిపాలనా రాజధాని విశాఖకేనట
అలా బుధవారం కూడా ఆయన జగన్ ను తనదైన శైలిలో ఆకాశానికెత్తేశారు. పర్యాటక శాఖ మంత్రిగాఇ కొనసాగుతున్న అవంతి… బుధవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. తన సొంతూరు విశాఖకు త్వరలోనే పరిపానల రాజధాని తరలిపోతుందని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదని చెప్పుకొచ్చారు. కోర్టు కేసులున్నా వాటిని పరిష్కరించేసి త్వరలోనే విశాఖలో అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ పెట్టేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ మనస్తత్వాన్ని ప్రస్తావించిన అవంతి… జగన్ సింహం లాంటోడని, అయితే సింహంలోనూ లేని దయా గుణం జగన్ లో ఉందని సెలవిచ్చారు. ఆ దయాగుణం కారణంగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న భావనతోనే మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చారని అవంతి చెప్పుకొచ్చారు.
మంత్రి పదవి నిలుపుకోవడానికేనా?
అయినా ఈ స్థాయిలో స్వామిభక్తిని అవంతి చాటుకోవడానికి కూడా చాలా కారణాలే ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ కేబినెట్ లో బెర్తు కోసం ఆశావహులు చాలా మందే ఉన్నారు కదా. అంతేకాకుండా తాను అధికారంలోకి మీ ఎమ్మెల్యేను మంత్రిని చేస్తానంటూ చాలా నియోజకవర్గాల ప్రజలకు కూడా హామీలు ఇచ్చారు. దానికి మించి మంత్రుల పదవీ కాలం రెండున్నరేళ్లేనని, సగానికి పైగా మంత్రులను మారుస్తానని కూడా జగన్ చెప్పారు. మరి ఆ రెండున్నరేళ్లు పూర్తి కావస్తోంది. సో.. తన పదవిపై కత్తి వేటు పడకుండా ఉండాలంటే.. ఏదో ఒకటి చేయాలి కదా. అందులో భాగంగానే జగన్ ను అవంతి ఆకాశానికెత్తేస్తున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Must Read ;- జగన్ స్మరణ ‘మెగా’ చిచ్చు పెట్టింది