వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామరాజుకు సికింద్రాబాద్‌లోని మిలటరీ హాస్పటల్‌లో జుడీషియల్ అధికారి సమక్షంలో ముగ్గురు నిపుణుల వైద్య బృందం నిర్వహించిన వైద్య పరీక్షల నివేదిక సుప్రీంకోర్టుకు పంపించారు.దీనిపై మిలటరీ మెడికల్ ఆసుపత్రి అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.ఎంపీ రఘురామరాజుకు అవసరమైన వైద్య పరీక్షలతో పాటు,చర్మ పరీక్షలు కూడా నిర్వహించారు.రఘురామరాజుకు నిర్వహించిన వైద్య పరీక్షలతో పాటు, ఆయన అభిప్రాయాలు కూడా వీడియోలో జుడీషియల్ అధికారి రికార్డు చేసినట్టు తెలుస్తోంది.మొత్తం వివరాలతో కూడిన రిపోర్టును న్యాయాధికారి సుప్రీంకోర్టుకు పంపించారు.శుక్రవారం జరగనున్న బెయిల్ పిటీషన్ సమయానికి రిపోర్టులను సుప్రీంకోర్టు పరిశీలించనుంది.
Must Read ;- RRR కుడి కాలికి గాయం.. ఆర్మీ వైద్యుల నివేదికతో కారణం వెల్లడయ్యే అవకాశం











