సీఐడీ రిమాండులో ఉన్న వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామరాజును గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలిస్తున్నారు.సాయంత్రం ఆరున్నరకు గుంటూరులోని జిల్లా ఆసుపత్రి నుంచి ఆయన సొంత కారులో ఎక్కించి సీఆర్పీఎఫ్ భద్రత నడుమ సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలిస్తున్నారు.రాత్రి 10 గంటలకు రఘురామరాజు ఆర్మీ ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఇప్పటికే జుడీషియల్ అధికారిని నియమించింది.రఘురామరాజు ఆర్మీ ఆసుపత్రికి చేరుకునే సమయానికి జుడీషియల్ అధికారి అక్కడ అందుబాటులో ఉండనున్నారు.
ఉత్కంఠ నడుమ
ఎంపీ రఘురామరాజును ఆర్మీ ఆసుపత్రికి తరలిస్తారా లేదా? అని సాయంత్రం వరకు ఉత్కంఠ నెలకొంది.ఏపీ ప్రభుత్వం మరల సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేస్తుందంటూ వార్తలు కూడా వచ్చాయి.అయితే సుప్రీం ఆదేశాలు అమలు చేయకుండా మరల కోర్టు మెట్లు ఎక్కితే సమస్యలు రావచ్చనే ఉద్దేశంతో తర్జన భర్జనల అనంతరం హడావుడిగా ఇవాళ సాయంత్రం రఘురామరాజును గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాదు ఆర్మీ ఆసుపత్రికి తరలించేందుకు సీఐడి అధికారులు ఏర్పాట్లు చేశారు.
Must Read ;0 సుప్రీంలో రఘరామరాజుకు ఊరట.. వై కేటగిరి భద్రత,ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు











