తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. డిసెంబర్ 31న పార్టీని.. పార్టీ గుర్తును ప్రకటిస్తానన్నారు. దీంతో డిసెంబర్ 31న ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆతృతతో ఎదురు చూస్తుంటే.. అనుకోకుండా రజనీ అస్వస్థకు గురయ్యారు. హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో కొన్ని రోజులు ఉన్న రజనీ ఆతర్వాత చెన్నైలోని ఇంటికి చేరుకున్నారు. డిసెంబర్ 31న పార్టీ గురించి ప్రకటిస్తారనుకుంటే.. 31 కంటే ముందే ఈనెల 29న రాజకీయాల్లోకి రావాలి అనుకోవడం లేదు. అభిమానులు క్షమించండి అంటూ మూడు పేజీల లేఖను రిలీజ్ చేశారు.

ఇది అటు సినీవర్గాల్లోను రాజకీయ వర్గాల్లోను సంచలనం అయ్యింది. రజనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు నిరాశకులోనయ్యారు. తమిళనాడులోని చాలా చోట్ల రజనీకాంత్ దిష్టి బొమ్మను దగ్దం చేసి ఆందోళన చేశారు. రజనీ రాజకీయాల్లోకి వస్తే.. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. రజనీ నిర్ణయం షాక్ ఇచ్చిందని చెప్పచ్చు. అయితే.. రజనీ నిర్ణయం పై యూనివర్శల్ హీరో, మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ స్పందించారు.
ప్రస్తుతం కమల్ హాసన్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. రజనీ నిర్ణయం గురించి స్పందిస్తూ.. ఆయన అభిమానుల లాగానే నన్ను కూడా రజనీ నిర్ణయం నిరాశపరిచింది. అయితే.. అన్నింటి కంటే తనకు రజనీ ఆరోగ్యమే ముఖ్యం అన్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాను. ఇది పూర్తవ్వగానే రజనీని కలుస్తానన్నారు. కమల్.. రజనీకాంత్ పార్టీ పెడితే పొత్తు పెట్టుకోవాలి అనుకున్నారు.











