సూపర్ స్టార్ రజనీకాంత్ 72 ఏళ్ల వయసులో దుమ్ము దులిపేస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు 12 రోజుల్లో 600 కోట్లకు చేరువయ్యాయి. ఇది కొత్త రికార్డు. దాదాపు 225 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. రజనీ స్టామినా ఏమిటో మరోసారి నిరూపితమైంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో రూపొందిన పాన్ ఇండియా సినిమాల కలెక్షన్లను కూడా జైలర్ దాటుకుంటూ ముందుకు వెళుతోంది. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్న పదానికి అసలైన నిర్వచనం జైలర్ సినిమా అనే చెప్పాలి.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి రజనీకాంత్ రూ. 110 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఆ లెక్కన చూస్తే ఇంత వయసులో ఇంత పెద్ద రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక హీరో అనే ఘనత కూడా రజనీకే దక్కుతుంది. ఈ సినిమా విడుదలైన 12వ రోజున కూడా ప్రపంచ వ్యాప్తంగా 12.54 కోట్ల వసూళ్లను సాధించింది. ఇండియన్ సినిమాల కలెక్షన్ల పరంగా చూస్తే దంగల్, బాహుబలి ది కంక్లూజన్ పేరుతో ఉంది. కాకపోతే వాటి బడ్జెట్ వేరు, జైలర్ బడ్జెట్ వేరు.
వరుస ఫ్లాప్ లతో రజనీ పనైపోయింది అనేవారికి సరైన సమాధానాన్ని ఈ జైలర్ సినిమా ఇచ్చింది. దంగల్, బాహుబలి 2, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2, పఠాన్, 2. 0 తర్వాత స్థానం జైలర్ కు దక్కేలా ఉంది. అయితే 2.0 కలెక్షన్ రూ. 709 కోట్లను జైలర్ దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పొన్నియన్ సెల్వన్ రికార్డులను కూడా జైలర్ దాటేసింది. ఈ ప్రభంజనం ఇక్కడితో ఆగేలా లేదు. తెలుగు 12 కోట్లకు అమ్ముడైన ఈ సినిమా రూ. 70 కోట్ల వసూలు దిశగా పరుగులు పెడుతోంది. మొత్తానికి టైగర్ ముత్తు వేల్ పాండ్యన్ గా రజనీ కొత్త రికార్డులకు తెరలేపాడనే చెప్పాలి.