వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉంటుంటారు. అయితే.. ఆయన చెప్పేదాంట్లో వాస్తవం ఉంటుంది కానీ.. ఒక్కొసారి వెరైటీగా.. ఎవర్నొ ఒకర్ని టార్గెట్ చేసి కామెంట్ చేయడం వలన వర్మను పట్టించుకోవడం మానేశారు. అయితే.. ఇప్పుడు వర్మ ‘కేజీఎఫ్ 2’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని ఆకాశానికి ఎత్తేసారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల ‘కేజీఎఫ్ 2’ టీజర్ ను రిలీజ్ చేశారు.

టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈ ‘కేజీఎఫ్ 2’ టీజర్ క్రాస్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ.. బాహుబలి 2 ట్రైలర్ కు 3 సంవత్సరాల్లో 11 కోట్ల వ్యూస్ వచ్చాయి. ‘ఆర్ఆర్ఆర్’ టీజర్ కి 3 నెలల్లో 3.8 కోట్ల వ్యూస్ వచ్చాయి. ‘కేజీఎఫ్’ 2 3 రోజుల్లో 14 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇది ప్రశాంత్ నీల్ ఇచ్చిన స్టమక్ పంచ్ లాంటిది అంటూ ప్రశాంత్ నీల్ ని ఆకాశానికి ఎత్తేశారు రామ్ గోపాల్ వర్మ.
కన్నడిగుల తరుపున ఆల్ ఇండస్ట్రీస్ కి స్టమక్ పంచ్ లాంటిది అన్నారు. ‘కేజీఎఫ్ 2’ కు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం.. హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా హీరోయిజాన్ని చూపించిన విధానం ఆడియన్స్ కి బాగా నచ్చింది. ఈ టీజర్ ‘కేజీఎఫ్ 2’ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పచ్చు. మరి.. ‘కేజీఎఫ్ 2’ మూవీ ఏ రేంజ్ సక్సస్ సాధిస్తుందో చూడాలి.
BAHUBALI 2 trailer 11 cr views in 3 YEARS RRR 3.8 cr in 3 MONTHS and KGF 2 14 cr in 3 DAYS.. OUCHH! This is a STOMACH PUNCH delivered by @Prashanth_neel on behalf of all KANNADIGAS into the stomachs of all the other film industries 😬😬😬
— Ram Gopal Varma (@RGVzoomin) January 15, 2021











