కరోనా వ్యాక్సిన్ రావడం ఆలస్యం అవుతున్న తరుణంలో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సహజసిద్ధమైన ప్రకృతి ఉత్పత్తి ద్వారా రోగనిరోధక శక్తిని పెంచే ఇమ్మునిటీ బూస్టర్ ను హైదరాబాద్ కు చెందిన క్లోన్ డీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించింది. కరోనా ముక్త్ భారత్ అన్న నినాదంతో దీర్ఘకాలంపాటు పరిశోధన చేసి ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లుగా కంపెనీ ప్రతినిధులు ప్రకటిస్తున్నారు.
కార్డిసెప్స్ మిలిటారీస్ అనే అరుదైన మష్రూమ్ ద్వారా ఈ ప్రొడక్ట్ రూపొందించామని, త్వరలో మెడిసిన్ రూపంలో కూడా రాబోతున్న ఈ ప్రొడక్ట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఫుడ్ ప్రొడక్ట్ గా కూడా క్లోన్ డీల్స్ సంస్థ అందుబాటులోకి తెస్తోందని సంస్థ సీఈవో అతీక్ పటేల్ వెల్లడించారు.
ఇప్పటికే దీనిపై సీసీఎంబి వంటి ప్రఖ్యాత సంస్థలు ట్రయల్స్ పూర్తి చేశారని, ఎయిమ్స్ కూడా హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించిందని అన్నారు. అత్యంత సహజ సిద్ధమైన ఆహార ఉత్పత్తి ద్వారా కోవిడ్ లాంటి మహామ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నట్లుగా ఆ సంస్థలు ఈ ఉత్పత్తిని ధ్రువీకరించాయన్నారు. ఓరల్ సస్పెన్షన్ రూపంలో తీసుకునే ఈ ప్రొడక్ట్ కరోనా పై పోరాడటంలో విజయవంతమైన ఫలితాలను ఇచ్చిందన్నారు. ప్రస్తుతానికి ఫుడ్ ప్రోడక్ట్ కేటగిరిలో అందుబాటులోకి వస్తున్న ఉత్పత్తిని ఈనెల 22వ తేదీన సిసిఎంబి అధికారికంగా ప్రకటించనుంది.