క్రికెట్ ప్రపంచంలో సరికొత్త సంబురానికి సమయం దగ్గర పడుతోంది. అనతికాలంలోనే అందరి మదిలో పదిలమైన ఐపీఎల్‌కు సర్వం సన్నద్ధమవుతోంది. ఏప్రిల్ 9 నుంచి జరగబోయే పండుగకు కసరత్తు ముమ్మరమైంది. అయితే.. ఈ సారి ఐపీఎల్‌లో కొత్త షరతులకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఇంతకీ.. పొట్టి క్రికెట్‌లో ఆ షరతులేంటి? అనివార్యమైన ఆ నిబంధనలేంటి?
New rules for IPL 2021 :
ఆ సాకుతో ఆలస్యం..
ఐపీఎల్ టీ 20 మ్యాచ్‌లో సమయం ఎంతో కీలకం. 90 నిమిషాల్లో ఒక ఇన్నింగ్స్ ముగించాల్సిందే! అయితే.. ఈ విషయంలో కొంత వెసులుబాటు ఉంది. 90వ నిమిషంలో ఇన్నింగ్స్ చివరి ఓవర్ మొదలైతే సరిపోతుంది. దీనిని స్లో ఓవర్ రేట్‌గా పరిగణలోకి తీసుకోరు. అయితే.. ప్రతిసారీ అన్ని జట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. దీనివల్ల మ్యాచ్ 10-15 నిమిషాలు ఆలస్యం అవుతోంది.
తొంభై అంటే తొంభయే..
ఐపీఎల్‌లో ఆ వెసులుబాటును సవరించారు. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ 90 నిమిషాల్లోనే ఇన్నింగ్స్ ముగించాలి. ఆ వ్యవధి దాటితే భారీ జరిమానా పడుతుంది. ఇకపై ఓవర్ రేట్ నిబంధనను సవరించి హెచ్చరిక జారీ చేసే అధికారం అంపైర్లకు ఉంటుంది. ఆ అధికారాన్ని అంపైర్లకు బీసీసీఐ కట్టబెట్టింది.
సాఫ్ట్ సిగ్నల్‌కు సెలవిక..
సాఫ్ట్ సిగ్నల్ నిబంధన.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో బాగా వివాదాస్పదమైంది. అందుకే ఐపీఎల్‌కు ఈ నిబంధనను పక్కన పెట్టేసింది బీసీసీఐ. క్యాచ్, అబ్ స్ట్రక్ట్ ద బాల్ లాంటి నిర్ణయాల విషయంలో సాంకేతిక ఆధారంగా మూడో అంపైర్‌కు స్పష్టత రానప్పుడు ఫీల్డ్ అంపైర్ ముందుగా సూచనప్రాయంగా ప్రకటించిన నిర్ణయాన్నే పరిగణలోకి తీసుకుంటారు. కానీ ఇకపై ఈ విషయంలో ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో పని ఉండదు. మూడో అంపైరే సాంకేతిక సాయంతో తుది నిర్ణయాన్ని ప్రకటించేస్తాడు. దీనితోపాటు బ్యాట్స్‌మెన్ పరుగు సరిగ్గా పూర్తి చేశాడా? లేదా? అని విషయంలోనూ అంపైర్ సరైన నిర్ణయం ప్రకటించలేదని భావిస్తే మూడో అంపైర్ దాన్ని మార్చొచ్చు.
Must Read ;- ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జర్సీని చూశారా?